
తెలుగుదేశం పార్టీ అంటే బిసిలు. అలాంటి ఆ పార్టీ కుంభస్థలాన్ని టార్గెట్ చేశారా? వైసిపి చీఫ్ జగన్ అన్న విశ్లేషణలు బయలుదేరాయి. వైసిపి ఓటు బ్యాంక్ చీల్చేందుకు ఎస్సి, ఎస్టీ, మైనారిటీలపై వరాలు కురిపిస్తూ గత నాలుగేళ్ళుగా టిడిపి అనేక ఎత్తుగడలు వేస్తూ వస్తుంది. ఎన్డీయే నుంచి బయటకు రావడం బిజెపి కి రాం రాం చెప్పడంతో గతంలో ఎంతోకొంత వున్న ఎస్సి, మైనారిటీ ఓటు బ్యాంక్ ల్లో కొంత తమ ఖాతాలో పడతాయన్న వ్యూహాన్ని చక్కగా అమలు చేస్తుంది తెలుగుదేశం. మరోపక్క పవన్ జనసేన తో కాపు సామాజిక వర్గం టిడిపి, వైసిపి లకు దూరం అవుతుందన్న అంచనాలు రెండు పార్టీల దగ్గరా లెక్కలతో సహా పక్కాగా వుంది. దాంతో అధికార, విపక్ష పార్టీలు ఒకరి ఓటు బ్యాంక్ పై మరొకరు కన్నేశారు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా టిడిపి కీలక ఓటు బ్యాంక్ ను తమవైపు లాక్కునే ప్రయత్నాల్లో వున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అందుకే నో చెప్పిన జగన్ …
ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో టిడిపి అధికారం దక్కించుకుంది అనే భావన వైసీపీది. అందులో ముఖ్యంగా కాపు రిజర్వేషన్ అంశం అన్నది గుర్తించిన వైసిపి అది తమ చేతుల్లో లేదని ముందే మొహమాటం లేకుండా చెబుతన్నామని తేల్చేసింది. అవసరమైతే కార్పొరేషన్ ద్వారా కాపులకు సాయం చేసే నిధులు ఇప్పుడు ఇస్తున్న వెయ్యికోట్ల రూపాయలను డబుల్ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.
సూటిగా చెప్పడం ద్వారా…..
ముక్కు సూటిగా సుత్తిలేకుండా జగన్ ఈ అంశాన్ని చెప్పడం ద్వారా తమ పార్టీకి భవిష్యత్తులో అధికారం అప్పగిస్తే చిక్కులు లేకుండా చూసుకోవడంతో బాటు అసంఘటితంగా వున్న బిసి ఓటర్లకు వల విసిరినట్లు అయ్యింది. బిసిలకు అన్యాయం చేయకుండా కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించిన టిడిపి గత నాలుగేళ్ళలో ఆ హామీ అమలు చేయలేకపోయింది. దీన్నే అస్త్రంగా మలుచుకున్న వైసిపి కాపులకు రిజర్వేషన్ నో చెప్పడం ద్వారా బిసి పార్టీగా వుంటూ వచ్చిన టిడిపి కి సరికొత్త సవాల్ విసిరింది.
Leave a Reply