ఫెయిల్ అవ్వడం వెనక జగన్?

జగన్

ముఖ్యమంత్రి జగన్ చాలా కోపంగా ఉన్నారట. ఆయన ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ పేరిట అటకెక్కేయడంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారని ప్రచారం ఓ వైపు సాగుతోంది. ఈ సమయంలోనే జగన్ శాసనమండలి రద్దు ఆలోచనలను కూడా సీరియస్ గా చేస్తున్నట్లుగా చెబుతారు. సరే ఆ గొడవ ఓ వైపు ఉంటే మరో వైపు కనీసంగా అరడజను మంది మంత్రుల మీద జగన్ ఆవేశపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు కధను కంచికి చేర్చకుండా ఫెయిల్ అయిన మంత్రుల విషయంలో జగన్ గుర్రుగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది.

ఆ ఆరుగురూ….

జగన్ మండలిలో ఎట్టి పరిస్థ్తితుల్లో బిల్లు ఆమోదం పొందాలని ముందే మంత్రులను ఆదేశించారని టాక్. దాని ప్రకారం వారు చేయాల్సిన బాధ్యతల గురించి కూడా ఆయన విడమరచిచెప్పారట. అయితే జగన్ అప్పగించిన బాధ్యతలు నెరవేర్చకపోగా బిల్లు మొత్తం కోల్డ్ స్టొరేజ్ లోకి చేరేంతవరకూ చేష్టలుడిగి చూస్తుండిపోయిన మంత్రుల నిర్వాకంపైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ విధంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, మోపిదేవి వెంకటరమణ. పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ జగన్ కోపాగ్నికి గురి అయిన ఆరుగురు మంత్రులుగా పేర్కొంటున్నారు.

వేటు తప్పదా…?

ప్రభుత్వానికి అప్రతిష్ట మూటకట్టించిన ఈ మంత్రుల విషయంలో ఏదో ఒకటి చేయాలని వైసీపీ సర్కార్ పెద్ద ఆలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాను రెండున్నరేళ్ళ పాటు మార్పుచేర్పులేవీ లేకుండా మంత్రివర్గం ఉంటుందని అనుకున్నానని, అయితే అంతవరకూ కధ సాగనిచ్చేట్టుగా లేరని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీని బట్టి చూస్తూంటే ఈ ఆరుగురు మంత్రులందరిపైనా వేటు వేస్తారా అన్న చర్చ కూడా ముందుకువస్తోంది. ఈ మంత్రులు శాఖాపరంగా కూడా పెద్దగా రాణించడంలేదన్న రిపోటులు జగన్ వద్ద ఉన్నాయట.

అన్నీ వివాదాలే…?

ఈ మంత్రుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ నోరు విప్పరు. ఆయన శాఖ సైతం అలాగే ఉంది. బొత్స నోరు విప్పితే వివాదాలే. ఆయన పనితీరు మీద సీఎం గుర్రుగా ఉన్నారని టాక్. ఇక మరో మంత్రి మోపిదేవి సైతం మెత్తగా, మెతగ్గా ఉంటున్నారని అంటున్నారు. కొడలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుని శాఖను పక్కన పెడితే అనిల్ కుమార్ సైతం కీలకమైన జలవనరుల శాఖలో తన సత్తా చాటలేకపోతున్నారు. ఇక పేర్ని నాని సైతం అండగా ఉంటారనుకుంటే అసలు వ్యూహాలే లేకుండా ఉన్నారని జగన్ భావిస్తున్నారని టాక్. ముందు శాసన‌మండలి సంగతి తేల్చేసిన తరువాత ఈ ఆరుగురు మంత్రులతో పాటు, పనిచేయని మిగిలిన వారి విషయం కూడా జగన్ మూడవ కన్ను తెరచి మరీ చూస్తారని అంటున్నారు. అదే నిజం అయితే సగానికి సగం మంది మంత్రులు సర్కార్ తొలి ఏడాది వచ్చేసరికల్లా మిగిలేలా లేరని వైసీపీ వర్గాల టాక్.

Ravi Batchali
About Ravi Batchali 35836 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*