
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఎన్నిలకలకు కౌంట్ డౌన్ మొదలైంది. నెల రోజుల్లో మొత్తం కధ కంచికి చేరనున్న వేళ ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ పార్తీ ప్రభావం ఎంత అన్న విషయంపై ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకూ టీడీపీకి కొమ్ము కాసిన ఈ జిల్లాలు ఇపుడు వైసీపీ వైపుగా మారుతున్నట్లుగా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రూరల్ బేస్ ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో గాలి మారుతోందని అర్ధమవుతోంది. అన్నింటా వెనకబడిన ఈ జిల్లాలకు గత అయిదేళ్ళ పాలనలో హామీలు తప్ప మరేమీ దక్కలేదన్నది మెల్లగా బోధపడుతోంది. అదే ఇపుడు అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారబోతోంది.
సిక్కోలు జై కొడుతుందా…
2004 ఎన్నికల్లో సిక్కోలు జిల్లా మొత్తం వైఎస్సార్ కి జై కొట్టేశింది. దాంతో ఇక్కడ మెజారిటీ సీట్లను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక 2009 ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కే పట్టం కట్టింది. 2014 నాటికి పదేళ్ళ తరువాత టీడీపీ పట్ల సానుభూతి పెరగడం, విభజన కారణంగా ఏపీకి చంద్రబాబు అవసరం ఉందని భావించడం, వెనకబడిన జిల్లాలకు మేలు జరుగుతుందని ఆశపడి టీడీపీకి ఓట్లేసి గెలిపించారు. అయితే ఇపుడు అయిదేళ్ళ పాలన చూసిన తరువాత 2019 ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అభివృధి అజెండాతోనే ఉత్తరాంధ్ర ఓటేయనుంది. దాంతో ఈ శ్రీకాకుళం, విజయగరం జిల్లాలలో మెజారిటీ సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విశాఖలో టీడీపీ పట్టు…
ఇక విశాఖ రూరల్ జిల్లాలో ఇపుడిపుడే వైసీపీకి సానుకూల స్పందన లభిస్తోంది. ఆ పార్టీకి అంతటా ఓ పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతోంది. అదే అర్బన్ జిల్లాలో మాత్రం టీడీపీ హవా బాగా ఉంది. గతంలో కూడా టీడీపీకి అర్బన్ జిల్లాలోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇపుడు వైసీపీకి ఇక్కడ ఒకటి రెండు చోట్ల తప్ప మిగిలిన ప్రాంతాల్లో బలమైన నేతలు ఎవరూ లేకపోవడం కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీకి ఉత్తరాంధ్రలో గతంలో 34 అసెంబ్లీ సీట్లలో 25 వరకూ వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య మాత్రం బాగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీకి 9 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇపుడు ఆ సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని విశ్లేషణగా ఉంది.
Leave a Reply