జగన్ ఏంటీ ఇది… మరీనూ..!!

ys-jaganmohanreddy-andhrapradesh-cm

జగన్ బంగరు చెంచా తో పుట్టారు. ఆయన తండ్రి రాజకీయాల్లో బలంగా ఉంటూ వచ్చారు. ఇక 2009లో వైఎస్సార్ దుర్మరణం వరకూ జగన్ వైభోగానికి ఏ లోటూ లేదు. ఓ విధంగా ఆయన రాజమందిరంలో సిధ్ధార్ధుడు మాదిరిగా కష్టం ఎరగకుండా బతికారు. ఇక తండ్రి చనిపోయిన తరువాత నుంచి జగన్ పదేళ్ల పాటు రోడ్డు మీదే ఉన్నాడు. అన్నీ తెలుసుకున్న బుద్ధుడు మాదిరిగా విలాసాలను త్యజించి మరీ వీధుల వెంట తిరిగారు. ఇలా ఒకే జీవితంలో రెండు పార్శ్యాలు జగన్ కి తప్ప ఎవరికీ సాధ్యం కావేమో. సరే జగన్ తండ్రి చాటు బిడ్డగా ఏంటన్నది ఎవరికీ తెలియదు కానీ జనంలోకి వచ్చాక ఆయన నిరాడంబరత అందరికీ తెలిసివచ్చింది. జగన్ ఎక్కడా అట్టహాసానికి ఆర్భాటానికి పోయిన దాఖలాలు లేవు. ఆయన పూర్తిగా జనం మనిషిగానే కనిపించారు.

ముఖ్యమంత్రి హోదాలోనూ…

ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే తీరు కనబరుస్తున్నారు. జగన్ ఆహారపు అలవాట్లు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. ఆయన ఎక్కువ తినరు. మాటల నుంచి ప్రతీ విషయంలోనూ అవసరం మేరకే అన్నట్లు ఉంటారు. తాను పొదుపు పాటిస్తారు. తనతో ఉన్న వారికీ అదే చెబుతారు. జగన్ సీఎం అయ్యాక తొలి మంత్రి వర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనంగా వచ్చింది చూసిన కొత్త మంత్రులు షాక్ తిన్నారుట. అది వర్కింగ్ లంచ్. అంతకు ముందు చంద్రబాబు టైంలో మంత్రులకు విందు భలే పసందు గా ఉండేదట. ఇక కలెక్టర్ల సమావేశం రెండు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలోనూ జగన్ అది సాధారణ భోజనం ఆర్డర్ చేశారట. తనకు కూడా అదే తెప్పించుకున్నారట. మరి కలెక్టర్లు ఏమంటారు, సీఎం కూడా అదే తింటే వారికి కూడా తినక తప్పదుగా.

ఖజానాకు భారం కారాదనే…..

జగన్ తీసుకుంటున్న ఈ పొదుపు చర్యలు ఖజానాకు భారం కారాదనేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాలు కేవలం భోజనాలకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల కుప్ప చేశాయని అంటున్నారు. ఏపీ ఇపుడు కష్టాల్లో ఉందని, ఇది విలసాలకు సమయం కాదని కూడా జగన్ భావిస్తున్నారుట. ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాలన్నది జగన్ విధానంగా చెబుతున్నారు. ప్రతీ పైసా ప్రజలదని, వారికి జవాబుదారిగా ఉంటేనే న్యాయం జరుగుతుందని కొత్త సీఎం భావిస్తున్నారు. మరి జగన్ ఆలోచనలు మంచివేనని తలపండిన మేధావులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ గాడిలో పడేవరకైనా పొదుపు మంత్రం పాటించడం మంచిదే.

Ravi Batchali
About Ravi Batchali 18753 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*