అతి పెద్ద హామీకి అదే అడ్డంకా?
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరుగుదల ఇప్పట్లో లేనట్లేనా? ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమా? అంటే అవుననే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల [more]
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరుగుదల ఇప్పట్లో లేనట్లేనా? ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమా? అంటే అవుననే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల [more]
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరుగుదల ఇప్పట్లో లేనట్లేనా? ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమా? అంటే అవుననే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పెంపుదలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జిల్లాల సంఖ్య పెంపుదల వద్దంటూ ఆర్థిక శాఖ నివేదిక ప్రభుత్వానికి అందించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పట్లో జిల్లాల సంఖ్య పెంపుదల ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్ర సమయంలో….
ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ప్రజలుకు హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారు. అంటే ప్రస్తుతమున్న 13 జిల్లాల స్థానంలో ఇరవై ఐదు జిల్లా కేంద్రాలు రానున్నాయి. దీనిపై ప్రభుత్వం అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అధ్యక్షతన కమిటీని కూడా నియమించింది. వివిధ వర్గాల అభిప్రాయలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను అందించింది.
కమిటీని నియమించి…..
అయితే ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై కసరత్తు చేయాల్సిన కమిటీ సయితం దానిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కరోనా వైరస్ ఏడాదిగా ఉండటం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయి ఉండటంతో కొత్త జిల్లాల ఏర్పాటులో ఆలస్యమయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ ఆర్థిక శాఖ మంత్రి కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తుందని తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే కొత్తగా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల కోసమే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రతి నెల జీతాలు, పెన్షన్లను ఇవ్వడానికే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో అయ్యేటట్లు కన్పించడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అమలు కాని అతి పెద్ద హామీ ఇదే కావడం విశేషం.