జగన్ ను తిట్టిపోశారుగా.. ఇప్పుడేమైంది?

జగన్

జగన్ కి ఏమీ తెలియదు అని చంద్రబాబు అనుకుంటారు. అనుకోవడమేంటి తాను కూడా నిందిస్తూ తన మందీ మార్బలంతో ఎక్కడికక్కడ పలుచన చేస్తూంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే పచ్చ పార్టీ గ్యాంగ్ జగన్ ని ఓ ఆట ఆడుకుంటోంది. ఈ మధ్య కరోనా వైర‌స్ గురించి జగన్ మీడియాతో మాట్లాడుతూ దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, పార‌సెట్ మాల్ బిళ్ళలు వాడితే సరిపోతుందని అన్నారు. అంతే జగన్ని అక్కడ నుంచి విడిచిపెట్టకుండా ఎల్లో గ్యాంగ్ ఓ ఆట ఆడుకుంది. చంద్రబాబు అయితే జగన్ కి ఏమీ తెలియదు అని ఇలాంటి సీఎం ఉండడం మన దౌర్భాగ్యమని పెద్ద మాటలే వాడారు. జాతీయ స్థాయిలో జగన్ పరువు తీస్తున్నారని తిట్టిపోశారు.\

వారిసంగ‌తేంటి…?

కరోనా వైరస్ కి ఇప్పటిదాకా మందు అన్నది లేదు. ఇది అందరూ ఆంగీకరించాల్సిన వాస్తవం. ఇక మాములూగా జలుబు దగ్గు, ఒళ్ళు నొప్పులకు మందుగా పారసెట్ మాల్ మెడిసిన్ ను డాక్టర్లు సూచిస్తారు. కరోనా కూడా మొదట జ్వరంతోనే మొదలవుతుంది. అందువల్ల జగన్ అది వాడితే ఉపశమనం వస్తుందని చెప్పారు. ఇక జగన్ ఒక్కరే కాదు, ఇదే మాట తెలంగాణా సీఎం కేసీయార్ కూడా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. పోనీ వీరిద్దరూ అనుకున్నా కేరళ ముఖ్యమంత్రి మహా మేధావి అయిన పినరయ్ విజయ్ కూడా పారసైట్ మాల్ వాడాలని చెప్పారు. వీరే కాదు, ఫ్రాన్స్ కి చెందిన మంత్రి ఒలివర్ వెరన్ కూడా పారాసైట్ మాల్ కరోనా వైరస్ కి మందు అన్నారు. మరి ఇంగ్లాండ్ లో సైతం ఇదే సూచిస్తున్నారు.

హూ చెప్పిందేంటి…?

ఇక జెనీవాలో ఉండే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (హు) సైతం పారసెట్ మాల్ మంచి మందు అని చెప్పినట్లుగా కధనాలు ఉన్నాయి. ఏకంగా ఓ ఆంగ్ల పత్రిక దీని మీద కధనం రాసింది. డబ్ల్యు హెచ్ ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మెయిర్ చెప్పినట్లుగా కూడా ఆ కధనంలో ఉంది. అదేంటి అంటే కరోనా వైరస్ సోకిన వారికి ప్రస్తుతం ఇస్తున్న ఇబుప్రొఫెన్ కంటే కూడా పారసెట్ మాల్ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుందని కూడా డబ్ల్యు హెచ్ ఓ అధికార ప్రతినిధి చెప్పినట్లుగా వెల్లడించింది. పారసెట్ మాల్ ని కరోనా వైరస్ చికిత్సా విధానంలో ఒకటిగా చేరుస్తామని కూడా అధికార ప్రతినిధి క్రిస్టియన్ చెప్పినట్లుగా కూడా వెల్లడించింది.

డాక్టర్లు చెబుతున్నారుగా ?

ఇక జగన్ చెల్లెలు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా స్వీయ‌ నిర్బంధనంతో పాటు పారసెట్ మాల్ వాడితే కరోనా వైరస్ నుంచి ఉపశమనం కలుగుతుందని ఈమధ్యే వెల్లడించారు. అలాగే ఇపుడున్న మందుల‌తో పాటు పారసెట్ మాల్ ని చేర్చి చికిత్సను అందిస్తున్నారు. నిజానికి కారంటైన్స్ వార్డుల్లో పెట్టిన వారికి ఏ మందులు వాడితే బయటపడుతున్నారు. కరోనాకు అసలైన‌ మందు రాలేదుగా. ఈ డౌట్ ఎవరికైనా వచ్చిందా. ఉన్న వాటిలోనే ఉత్తమంగా పారసెట్ మాల్ మందు బిళ్ళ వాడమని జగన్ చెబితే ఆయన్ని తెలివి తక్కువ వాడిగా టీడీపీ గ్యాంగ్ చిత్రీకరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి అంటున్నారు.

అదే చేస్తున్నారుగా…?

ఏది ఏమైనా జగన్ చెప్పినట్లుగానే బ్లీచింగ్ పౌడర్ ని హైదరాబాద్ అంతా జల్లించి వాటిని అక్కడి మంత్రి కేటీయార్ ఫోటోలు కూడా తీసి మీడియాకు పంపించారు. మరి జగన్ చెబితే ఏదైనా తప్పే. ఆయనకు ఏదీ తెలియదు, ఆయన వట్టి వేస్ట్ అని టీడీపీ అంటుంది. తనకున్న వేయి నోళ్ళతో అనిపిస్తుంది. దాన్నే పట్టుకుని ఎల్లో మీడియా కూడా వికటాట్టహాసం చేస్తోంది. దీన్ని గట్టిగా ఖండించి కనీసం తమను తాము రక్షించుకునే సోయి, తెలివి వైసీపీ నేతలకు లేకపోయే. మొత్తానికి జగనూ, పారసెట్ మాల్ ఇపుడు అల్లరల్లరి అవుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 23907 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*