ఊహించలేకపోయా…!!

జగన్

అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నానని, తన మీద ఇంతటి ప్రేమానురాగాలు కురిపించిన మీ రుణం తీర్చుకోలేనిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇచ్ఛాపురంలో వచ్చిన జనాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇడుపుల పాయలో తొలి అడుగు వేసినప్పుడు తాను ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదన్నారు. పథ్నాలుగు నెలలుగా 3,648 కిలోమీటర్లు నడిచానంటే….నడిచింది నేనయినా నడిపించింది మీరేనని ఆయన తెలిపారు. 3,648 కిలోమీటర్లు నడిచానంటే తనకే నమ్మశక్యంగాలేదన్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్, కశ్మీర్ నుంచికన్యాకుమారి వరకూ ఉన్న దూరం కంటే ఎక్కువగా నడిచానంటే అది కేవలం ఆప్యాయతలు, దేవుడి ఆశీస్సులేనన్నారు. ఇచ్ఛాపురం ముగింపు సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఎంత నడిచామన్నది ముఖ్యంకాదు….

ఎంతదూరం నడిచామన్నది ముఖ్యంకాదని, ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాం, ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ప్రధానమన్నారు. చంద్రబాబునాయుడు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనను తనకు పాదయాత్రలో జనమే చెప్పారన్నారు. రాష్ట్రంలో కరవు,తుఫానులు సంభవిస్తుంటే, విభజనతో రాష్ట్రం నష్టపోయి ఉంటే చంద్రబాబు దోపిడీతో మరింత దెబ్బతిందన్నారు. రుణమాఫీఅంటూ రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు. 2014 ఎన్నికలలో చంద్రబాబు చేసిన వాగ్దానాలను అమలు పర్చకుండా ఎలా మోసం చేయాలో పీహెచ్ డీ చంద్రబాబు చేశారన్నారు. ఇన్ని అరాచకాలు చూస్తే గుండె మండిపోతుందన్నారు. పిల్లలను అవిటి వాళ్లనుచేసి అడుక్కునే వాళ్లకు రాష్ట్రం కష్టంలో ఉందంటూ పదే పదే దోచుకుంటున్న చంద్రబాబుకు ఏదైనా తేడా ఉందా? అని జగన్ ప్రశ్నించారు.

రైతుల పట్ల దగా….

రైతాంగం ఎంత అవస్థలు పడుతున్నారో తాను ఈ పథ్నాలుగు నెలల్లో కళ్లారా చూశానన్నారు. అనంతపురం లో శివన్నఅనే రైతు చెప్పినది వింటే తనకన్నీరు ఆగలేదన్నారు. చంద్రబాబుతో పాటు ఎప్పుడూకరువుకూడా కలిసే వస్తుందన్నారు. కరువును పారదోలేందుకు రెయిన్ గెన్ ద్వారా పంటను కాపాడతామని చంద్రబాబు చెప్పారన్నారు. ఐదెకరాల్లో వేరుశెనగ పంట వేస్తే రెయిన్ గెన్లతో తాను అరబస్తా వేరువెనగ దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పుడు ఏపీలో రైతులందరూ చంద్రబాబును నమ్మము బాబూ అంటున్నారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ రావడం లేదన్నారు. 2018 జూన్ 1 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ అన్ని జిల్లాల్లో వర్షపాతం లోటుగా నమోదవుతుందన్నారు. రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు.

జాతీయ రాజకీయాలంటూ….

ఈ మధ్య జాతీయ రాజకీయాలు అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. కర్ణాటకలో కుమారస్వామితో కాఫీ తాగుతూ పక్కనే ఉన్న అనంతపురాన్ని పట్టించుకోరన్నారు. చెన్నై వెళ్లి స్టాలిన్ తో సాంబారు, ఇడ్లీ తిని చిత్తూరు జిల్లా రైతుల వెతలు పట్టించుకోరని తెలిపారు. కోల్ కత్తా వెళ్లి మమతబెనర్జీ తోచికెన్ తిని, రైతుల కష్టాలు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించకుండా, హెరిటేజ్ షాపుల లాభాల కోసం తప్పుడు బాట పడుతున్నారన్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర 1,750లు అని, ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దళారులు అన్నదాతలను మోసగిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పలాస జీడిపప్పు రైతుల దగ్గర కేజీ రూ.650లు అమ్ముకోలేకుండా ఉన్నారని, బాబు హెరిటేజ్ లో మాత్రం అదే జీడిపప్పు కేజీ 1120లకు అమ్ముతున్నారన్నారు. రైతులను దారుణంగా మోసం  చేస్తున్నారన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 39319 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*