
గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని జన్మభూమి కమిటీ మాఫియా రాజ్యమేలుతుందన్నారు. ఇచ్ఛాపురంలో జరిగినముగింపు సభలో తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే పింఛను కూడా వస్తుందన్నారు. చివరకు గ్రామాలకు గ్రామాలు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. చంద్రబాబు ఇసుక దగ్గర నుంచిపోలవరం ప్రాజెక్టు వరకూ దోపిడీ చేస్తున్నారు. ఏది కావాలన్నా మీది ఏ పార్టీ అని కమిటీలు అడుగుతున్నాయన్నారు.
నోటికి..మెదడుకు కనెక్షన్ లేదు….
చంద్రబాబునాయుడికి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టెంపరేచర్ పెరిగిందన్నారు. నోటి మాటకు, మెదడుకు కనెక్షన్ చంద్రాబాబుకు తప్పిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పేదలకు కొత్త ఇళ్లు, కొత్త పింఛన్లు అంటూ మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ప్రజలు చంద్రబాబును గమనిస్తున్నారన్నారు. అందుకే ప్రజలు ఈరోజు నిన్ను నమ్మం బాబూ అని అంటున్నారన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి….
ఎమ్మెల్యేలను సంతలో పశులను కొన్నట్లు కొని, అందులో కొందరిని మంత్రులుగా చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిన చంద్రబాబు పాలన మళ్లీ కావాలా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న తెలంగాణలోకి వెళ్లి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలకు ఓట్లేయొద్దని పిలుపునిస్తారన్నారు. ఊసరవెల్లి కన్నా స్పీడ్ గా రంగులు మార్చే నైజం చంద్రబాబు అని అన్నారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ప్రత్యేక హోదా అంటూ బయటకు వచ్చి డ్రామాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా కోసం తాను నాలుగేళ్లుగా పోరాటం చేస్తే వెటకారం చేశారన్నారు. హోదా అంటే జైల్లో పెట్టిస్తానని అన్నది చంద్రబాబు కాదా? అని నిలదీశారు. కానీ ఇప్పుడు ఎన్నికలువచ్చే సరికి ప్రత్యేక హోదా అంటూ పోరాటమంటున్నారన్నారు.
Leave a Reply