లాస్ట్ డే..జగన్ డెసిషన్ ఏంటి..?

ys jaganmohanreddy-ysr congress party-decission

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేయనున్నారు? ఈనెల 23వ తేదీ ఆఖరు తేదీ. న్యాయస్థానం కోరినట్లుగా జగన్ తాను గాయపడిన సందర్భంలో ధరించిన చొక్కాను అప్పగిస్తారా? పోలీసులకు స్టేట్ మెంట్ ఇస్తారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత నెల 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ ఈ గాయానికి విశాఖ ఎయిర్ పోర్టులోనే ప్రధమ చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లిపోయి అక్కడ శస్త్ర చికత్స చేయించుకున్నారు. విశాఖలో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను దర్యాప్తునకు నియమించింది.

స్టేట్ మెంట్ ఇవ్వడానికి…..

అయితే ఏపీ పోలీసులు హైదరాబాద్ లో చికిత్స పొందుతుండగా జగన్ ను కలసి స్టేట్ మెంట్ రికార్డు చేయాలని ప్రయత్నించారు. కానీ జగన్ తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని స్టేట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. సంఘటన జరిగిన వెంటనే డీజీపీఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ఈ కేసులో విచారణ జరుగుతోంది. మరోవైపు ఏపీ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

న్యాయస్థానం తుదిగడువు….

వైసీపీ అధినేత జగన్ కు సిట్ అధికారులు ఇప్పటికి రెండు సార్లు నోటీసీులు ఇచ్చారు. 160 సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ చేశారు. అయితే రెండుసార్లు జగన్ స్టేటమ్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై సిట్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. నేరఘటన జరిగినప్పుడు బాధితుడు తమకు సహకరిస్తేనే విచారణ ముందుకు సాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్ ను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణాధికారులు ప్రశ్నించారు. దాడి చేయడానికి గల కారణాలను వారు నిందితుడి నుంచి రాబట్టారు. అయితే ఈ కేసులో విచారణ మరింత ముందుకు సాగాలంటే జగన్ సహకరించాల్సిందేనంటున్నారు పోలీసు అధికారులు.

న్యాయనిపుణులతో….

ఇక జగన్ దాడిసమయంలో ధరించిన చొక్కాను న్యాయస్థానానికి అప్పగించాలని విశాఖ న్యాయస్థానం జగన్ ను ఆదేశించింది. జగన్ తోపాటు ఆయన పర్సనల్ సెక్రటరీకి కూడా నోటీసులు పంపింది. ఇందుకు ఈ నెల 23వ తేదీలోగా చొక్కాలను అప్పగించాలని కోరింది. రేపు ఆఖరు తేదీ కావడంతో జగన్ చొక్కా న్యాయస్థానానికి అప్పగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. న్యాయనిపుణులతో వైసీపీ నేతలు సంప్రదిస్తున్నారు. చొక్కాను జగన్ న్యాయస్థానానికి అప్పగించినప్పటికీ, పోలీసులకు స్టేట్ మెంట్ విషయంలో మాత్రం జగన్ నిక్కచ్చిగానే ఉన్నారని, ఆయన స్టేట్ మెంట్ ఏపీ పోలీసులకు ఇవ్వరని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి లాస్ట్ డే…జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 37162 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*