జగన్ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందేనా…???

ys jaganmohnreddy change his decission

ఎన్నికలకు, కులాలకు అవినాభావ సంబంధం ఉంది. అయిదేళ్ళ పాటు మౌనంగా ఉన్న వారంతా ఓట్ల పండుగ దగ్గర పడడంతోనే మూలన దాచిన డిమాండ్లను పట్టుకుని ముందుకువచ్చేస్తారు. ఇపుడు విశాఖ జిల్లాలోనూ అదే జరుగుతోంది. విశాఖ సహా ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారులు ఇటీవల నగరంలో మీటింగు పెట్టి అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేశారు. తమ కులాన్ని పట్టించుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని కూడా హెచ్చరించారు. గత ఎన్నికల్లో మత్స్యకారులను ఎస్టీ జాబితాలో పెడతామని చెప్పిన టీడీపీ దాన్ని గాలికి వదిలేసిందని సంఘం నాయకులు విమర్శించారు. ఈసారి ప్రతి రాజీకీయ పార్టీ దాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టడమే కాదు, తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వాలాని నాయకులు కోరారు.

ఆ సీటు ఇవ్వాల్సిందే…..

ఇక విశాఖలో అతి కీలకమైన దక్షిణ నియోజకవర్గం సీటుని మత్స్యకారులకు ఇవ్వాల్సిందేనని వారు డిమాండు చేశారు. మొత్తం జనాభాలో యాభై వేలకు పైగా ఉన్న తమ కులమే అక్కడ పెద్దదని, పైగా ఉత్తరాంధ్రలో ప్రాధాన్యత గల ఆ సీటుని తాము ఎట్టి పరిస్తితుల్లోనూ వదులుకోమని అంటున్నారు. తమకు ఆ సీటు కేటాయించిన పార్టీకే మద్దతు ఇస్తామని కూడా ఖరాఖండీగా నాయకులు చెప్పేశారు. దాంతో అన్ని రాజకీయ పార్టీలూ ఆలొచనలో పడ్డాయి.

వైసీపీకి మైనస్…

అక్కడ మత్స్యకారుడైన కోలా గురువులుని ఇంచార్జిగా తొలగించి కాలింగ కులస్తున్ని తీసుకువచ్చి ఇంచార్జిగా వైసెపీ నియమించింది. జగన్ విశాఖ పాదయాత్రలో పిలిచి మరీ ఆయనకు కండువా కప్పి సీటు ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇపుడు అక్కడ మత్య్సకారులను తప్పించి వేరొకరికి కట్టబెట్టడం పై పార్టీలోనూ రచ్చ జరుగుతోంది. ఇపుడు బయట ఆ సామాజికవర్గం కూడా గుస్సా అవుతోంది. తొలి జాబితాలో దక్షిణ ఇంచార్జిగా ఉన్న వైసీపీ నేత రమణమూర్తి పేరు ప్రకటిస్తారని అంతా భావిస్తున్న వేళ మత్స్యకార సంఘం అల్టిమేటం తో జగన్ డెసిషన్ మారుతుందా అన్న చర్చ సాగుతోంది.

టీడీపీలోనూ అంతే…

ఇక మరో వైపు టీడీపీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకార వర్గీయుడే. అయితే ఆయన్ని తప్పించి పొత్తులో భాగంగా కాంగ్రెస్ కి కట్టబెట్టాలని అనుకుంటున్నారు అలా కాకపోయినా పార్టీలో వేరొకరికి ఇవ్వాలని చూస్తున్నారు. ఇపుడు మత్స్యకారుల డిమాండ్లతో టీడీపీ ఏం చేస్తుందో చూడాలి. జనసేనకు కూడా ఈ అల్టిమేటం ఇబ్బందికరమే. బీసీ నేతకు అక్కడ టికెట్ కన్ ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఒక్క మీటింగుతో ఆ సామాజిక వర్గం నేతలు అన్ని పార్టీల హై కమాండ్లకూ దడ పుట్టించేశారు. అంతే కాదు ఎస్టీల్లో చేర్చాలని కూడా కోరుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*