జగన్ ఎలా డీల్ చేస్తారో…??

జగన్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ విచిత్రంగా ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలతో ఏపీ ఎన్నికల్లో అప్రతిహిత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీలో గతంలో సీన్ మళ్లీ రిపీట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీలో మూడు పార్టీలే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు మాత్రమే దక్కడంతో ప్రతిపక్షం అంత బలంగా లేదనే చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలు ఈసారి కూడా ఏకపక్షంగానే జరగనున్నాయన్నది వాస్తవం.

మూడు పార్టీలే….

2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 102 స్థానాలు సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల్లో గెలిచింది. భారతీయ జనతా పార్టీ అప్పట్లో తెలుగుదేశం మిత్రపక్షంగా ఉండి నాలుగు స్థానాల్లోవిజయం సాధించింది. దీంతో శాసనసభలో మూడు పార్టీలు మాత్రమే కన్పించాయి. భారతీయ జనత పార్టీతో పొత్తు ఉండటంతో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వంలో రెండు పార్టీలు చేరాయి. దీంతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో వైసీపీ బలం 44 మంది మాత్రమే వైసీపీకి మిగిలారు.

ఏకపక్షంగా సమావేశాలు….

దీంతో గత శాసనసభ సమావేశాలన్నీ ఏకపక్షంగా సాగాయి. ప్రతిపక్షానికి మైకు ఇచ్చే పరిస్థితి కూడా కన్పించలేదు. ప్రశ్నలు అడిగినా పట్టించుకునే పాపాన పోలేదు. ప్రతిపక్షం కూడా సభలోనే ఆందోళనకు దిగడం సర్వ సాధారణంగా మారింది. దీంతో అనేకసార్లు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు కూడా గురయ్యారు. ఆర్ కె రోజా పై అయితే ఏకంగా ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రతిపక్ష వైసీపీ దాదాపు రెండేళ్ల నుంచి అసెంబ్లీకి రావడం మానేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులపై అనర్హత వేటు వేస్తేగాని అసెంబ్లీలోకి అడుగుపెట్టమని వెళ్లిపోయింది. అప్పటికి బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి చెడటంతో శాసనసభలో బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషించాల్సి వచ్చింది.

ఇప్పుడూ అంతే….

ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యేటట్లు కన్పిస్తుంది. ఇప్పుడు కూడా శాసనసభలో మూడు పక్షాలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలకు చోటు దక్కలేదు. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా, టీడీపీ ప్రతిపక్షంగా, జనసేన ఒక అభ్యర్థితో సభలో కన్పించనుంది. గత ఐదేళ్ల పాటు తాము పడ్డ బాధలను ఇప్పుడు తీర్చుకుంటామని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. బిల్లులు పాస్ అవ్వడానికి ప్రతిపక్షం మద్దతు అవసరం లేని పరిస్థితి. చంద్రబాబునాయుడు కూడా ఈ దారుణ ఓటమితో అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి చూపకపోవచ్చు. దీంతో రెండోసారి కొలువుతీరే శాసనసభలో కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశముంది.

Ravi Batchali
About Ravi Batchali 30230 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*