జగన్ దెబ్బకు..బీజేపీకి ఇరకాటమేనా…!!

ysjaganmohanreddy-bharathiya-janatha-party-

కేంద్రంలో భారీ మెజారిటీతో రెండోసారి అధికారం చేపట్టిన ఘనత మోడీది. ఇక ఎవరూ ఎదురులేదు అనుకుంటున్న తరుణం ఇది. ఓ వైపు కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు తెచ్చుకోలేక చతికిలపడింది. ఇక మోడీ విషయానికి వస్తే దేశంలో ఎదురులేని పొజిషన్లో ఉన్నారు. సొంతంగానూ, కూటమితో బంపర్ మెజారిటీతో ఆయన హవా దూసుకుపోతోంది. మరి అటువంటి మోడీకి షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇపుడు చూసుకుంటే మోడీకి దేశవ్యాప్తంగా ఎదురునిలిచే నాయకుడు జాతీయ స్థాయిలో, ప్రాంతీయంగా ఎవరూ లేరన్నది నిజమని చెప్పాలి. కేసీఆర్ కి కూడా తాజా లోక్ సభ ఎన్నికల్లో కన్నం పడింది. ఇదివరకు దూకుడు చూపించలేరు. ఇక మమత, మాయా వంటి వారు ఉన్నామా అన్నంతగా పడిపోయారు.

ఒకే ఒక్కడు….

ఈ పరిస్థితుల్లో ఏపీలో తిరుగులేని మెజారిటీ సాధించిన జగన్ 22 మంది ఎంపీలతో పార్లమెంట్ లో మోడీని గడగడ లాడించేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు కావాల్సింది ప్రత్యేక హోదా. మరి ఈ విషయంలో జగన్ ఎక్కడా రాజీ పడడంలేదు. ఈ నెల 9న ప్రధాని మోడీ తిరుపతి వస్తుంటే అక్కడకు కూడా హోదా గోల వినిపించనున్నాడు. ఇక 15న నీతి ఆయోగ్ లో కూడా ఇదే వాదనతో సీఎం ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలవ్వాలి కానీ 22 మంది వైసీపీ ఎంపీలు, టీఆర్ఎస్ ని కలుపుకుని సభలో రభస చేస్తే మోడీకి షాక్ తగలకుండా ఉంటుందా. అయిదేళ్ళ నాటి మాటను తప్పినందుకే ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి పోల్ అయ్యాయి. మరి ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే హోదా అంటున్నారు. అంటే ఏపీ జనాలు ఆ విషయాన్ని మరచిపోకుండా వేడి రగులుతూనే ఉంటుందన్న మాట.

కమలానికి కషాయమేనా…?

అదే జరిగితే ఏపీలో విస్తరించాలనుకుంటున్న బీజేపీకి జగన్ రూపంలో గట్టి షాక్ తగులుతున్నట్లే. ఈ విషయమై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఓ మాట అన్నారు. తాము ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఇటు ఆంధ్ర, అటు తెలంగాణాలో దారుణంగా దెబ్బతిన్నామని, తెలంగాణాలో సెటిలర్ల ఓట్లు తమకు పడలేదని ఒప్పుకున్నారు. మరి రాజకీయ అవసరాల కోసమైన బీజేపీ హోదా ప్రకటిస్తుందా చూడాలి. ఏపీలో ఉన్నది జగన్ అన్నది ఇపుడు బీజేపీ బాగా గుర్తు పెట్టుకోవాల్సివుంటుందని అంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 16592 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*