పక్కాగా…సర్వే ప్రకారమే…??

ysjaganmohanreddy-candidates-list

నామినేషన్లు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే దాదాపు 150 నియోజకవర్గాలు, దాదాపు ఇరవై పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులపై జగన్ టిక్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు రెండు ప్రయివేటు సంస్థల ద్వారా చేయించిన సర్వేలతో అభ్యర్థులపై తుది కసరత్తు పూర్తిచేశారంటున్నారు. పీకే టీం సర్వే, మరో రెండు సంస్థలు చేసిన సర్వే ఫలితాలు దాదాపు ఒకే రకంగా ఉండటంతో సర్వే ఆధారంగా టిక్కెట్లను కేటాయించనున్నారు.

ఈ నెల 15న జాబితా…..

18 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండంగా ఈనెల 15వ తేదీన జగన్ తన అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే రోజు బస్సు యాత్రకు జగన్ బయలుదేరనున్నారు. మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పదిహేనో తేదీన ప్రకటించి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంద. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పార్టీలోకి వస్తుండటంతో ఆ స్థానాలపై సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వస్తారన్న ప్రచారం ఉంది. ఆయన పార్టీలో చేరితే ఒంగోలు ఎంపీ టిక్కెట్ ను కన్ఫర్మ్ చేయనున్నారు.

నేతల రాక కోసం….

అంతేకాకుండా బాపట్ల,విశాఖపట్నం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో సయితం కొత్త వ్యక్తులకు టిక్కెట్ ఇచ్చే అవకాశముందంటున్నారు.కొన్నిఅసెంబ్లీ స్థానాల్లోనూ జగన్ ఇతర పార్టీలనుంచి నేతల రాక కోసం వెయిట్ చేస్తున్నట్లుచెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే వైసీపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నప్పటికీ వారిపై ఉన్న వ్యతిరేకతను జగన్ బేరీజు వేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా పార్టీకోసం కష్టపడిన వారికి మాత్రం అన్యాయం చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కావలి వంటి శాసనసభ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు పట్టుబడుతుండటంతో వారితో మరోసారి స్వయంగా సమావేశమవ్వాలని నిర్ణయించారు.

ఒకేసారి ప్రకటించి….

ఒకేసారి అభ్యర్థులను మొత్తాన్ని ప్రకటించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు జగన్. దీనివల్ల అభ్యర్థులు వేగంగా ప్రచారం చేసుకునే అవకాశముంది.ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో అభ్యర్థుల ఖరారులో ఇక జాప్యం చేయకూడదని నిర్ణయించారు. టీడీపీ, జనసేన పార్టీలతో సంబంధం లేకుండా జాబితాను విడుదల చేయాలన్న యోచనలో ఉన్నారు. కాకినాడ లో సమర శంఖారావం సభలోనే వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. గెలుపు గుర్రాలే ప్రాతిపదికగా జగన్ విడుదల చేయనున్న జాబితాపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Ravi Batchali
About Ravi Batchali 23782 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*