జగన్ గెలవగలరా ?

ysjaganmohanreddy nutral voters

ఎవరీ తటస్థులు ? ఎందుకు వారిపై వైసిపి గురిపెట్టింది ? వీరివల్ల ఎన్నికల ఫలితం తారుమారు అవుతుందా ? తటస్థుల మనసు జగన్ మార్చగలరా ? ఇలాంటి ప్రశ్నలకు అవును అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది జగన్ పార్టీ. ఏ పార్టీవైపు లేకుండా ఎన్నికల్లో ఫలితాలను తలకిందులు చేసేవారే ఈ తటస్థులు. క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా వుండే వీరు తమ ఒక్క ఓటునే కాదు తమ నోటి మాట తో వందలమంది పై ప్రభావం చూపగలవారు. వైద్యులు, ఇంజనీర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు తటస్థుల జాబితాలో వున్న వారు. ప్రైవేట్ రంగంలో అత్యంత ప్రభావిత వ్యక్తులుగా సమాజంలో వున్నవారు ఇప్పుడు వైసిపి టార్గెట్.

కనిపెట్టింది బాబు …?

ఈ తటస్థులను ఆకర్షించే కార్యక్రమం చంద్రబాబు రెండు దశాబ్దాల కింద ప్రవేశపెట్టిన ఫార్ములానే. తటస్థుల మనసు గెలిచి బాబు అధికారంలోకి వచ్చిన సందర్భాలు వున్నాయి. దానినే ఇప్పుడు జగన్ అందిపుచ్చుకున్నారు. ఓటర్లపై ప్రభావం చూపే వారితో జిల్లాల వారీగా జగన్ నేరుగా భేటీ అవుతున్నారు. వారికి వైసిపి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలు వివరించడంతో బాటు వారు ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.

జగన్ ఎందుకు చేపట్టారంటే …?

“జగన్ ఎవరి మాట వినడు. తాను అనుకున్నదే అమలు చేస్తాడు తప్ప మరొక ఆలోచన చేయడు . పెద్దలు అంటే గౌరవం అస్సలు ఉండదు.” ఇలాంటి ప్రచారం వైసిపి ప్రత్యర్ధులు తరచూ చేస్తూ వుంటారు. జగన్ క్యారెక్టర్ ను నెగిటివ్ చేయడంలో ఆయన ప్రత్యర్ధులు గత ఎన్నికల్లో విజయం సాధించారు. కేవలం ఐదులక్షల ఓట్ల తేడాతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వైసిపి కళ్ళు తెరిచింది. దీనికి తోడు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్ సైతం వివిధ వర్గాలతో సమావేశం కావడం వల్ల వారు అందించే సలహాలు సూచనలు ఉపయోగపడుతున్నాయి. దాంతో తటస్థులతో సమావేశాల కారణంగా తనపై పడ్డ మచ్చను, ప్రత్యర్ధులు విసిరిన బురదను తొలగించుకోవడానికి వైసిపి చీఫ్ కి అత్యవసరమే అయ్యింది. అందుకే తటస్థులతో సమావేశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్.వైసిపి చీఫ్ చేస్తున్న ఈ తాజా ప్రయత్నం ఫ్యాన్ పార్టీకి ఈమేరకు మేలు చేస్తుందో వచ్చే ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1080 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*