
ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్ ను అనేక సంఘటనలను ప్రజలు కళ్ళకు కట్టినట్లు చెప్పుకున్నారు. వాటిలో అనేక సంఘటనలు తనను కదిలించాయని ఇచ్ఛాపురం సభలో జగన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పేద విద్యార్థులు వారి తల్లితండ్రులు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులు అన్ని ఇన్ని కావని వెల్లడించారు జగన్. దీనికి ప్రధాన కారణం వైఎస్ ప్రారంభించిన ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సక్రమంగా అమలు చేయకపోవడమే నని తెలిపారు విపక్ష నేత. వంద శాతం ఫీజు చెల్లించాలిసిన ప్రభుత్వం 30 శాతం మాత్రమే కట్టడం వల్ల రాష్ట్రంలో అనేక మంది అప్పులఊబిలో కురుకుపోతున్నారని వివరించారు.
విద్యార్థి ప్రాణాలు ఇలా పోయాయి …
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కృష్ణారెడ్డిపాలెం చిన్న గ్రామం. పాదయాత్రలో వెళుతున్నప్పుడు ఆ ఊరిలో ఒక పూరిగుడిసె ముందు ఒక చిన్నారి ఫ్లెక్సీ వేలాడుతుంది. ఆ ఫ్లెక్సీ లో వున్న అబ్బాయికి దండవేసి వుంది. ఆ గుడిసెలో వుండే గోపాల్ అనే వ్యక్తి నన్ను కలిశాడు. అన్న ఆ ఫ్లెక్సీ లో వున్నది మా అబ్బాయినే అని చెప్పాడు. ఏమైంది అని అడిగా. మా అబ్బాయిని ఇంజనీరింగ్ లో చేర్పించాం లక్ష రూపాయల ఫీజు కట్టాలి. 30 వేలరూపాయలు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లిస్తుంది. మిగిలిన 70 వేలరూపాయలు అప్పు చేసి కట్టి జాయిన్ చేసాం కాలేజ్ లో.
అప్పు చేసి కడతానన్నా…
తరువాత ఏడాది మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చి అడిగాడు ఈ ఏడాది ఎలా కడతావు ఫీజు అని అడిగాడు. ఏముంది ఎదో రకంగా అప్పు చేసి కడతా నువ్వు బాగా చదువుకో అని చెప్పాను. కానీ కాలేజ్ కి వెళ్లిన గోపాలన్న కొడుకు తండ్రికి భారంగా మారుతున్నా అని ఆవేదనతో ఉరి వేసుకుని చనిపోయాడని ఆ సంఘటన విన్నప్పుడు చలించి పోయా అంటూ అందరిని కదిలించారు జగన్. గోపాల్ కుటుంబానికి వచ్చిన కష్టం ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్నా అని. మన ప్రభుత్వం వస్తే పూర్తి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు జగన్.
Leave a Reply