జగన్ సూపర్ ఇన్నింగ్స్…!!!

జగన్

నేలఈనిందా ఆకాశం బద్దలైందా అన్న తీరులో జన సముద్రంతో నిండిపోయింది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం. ఎక్కడ చూసినా జనమే జనం. జై జగన్, జై వైఎస్ జై వైఎసార్సీ అంటూ నినాదాల హోరు బహుదా నదీ తీరం మార్మోగిపోయింది. వైఎస్ జగన్ పాదయాత్ర చివరి రోజు సరికొత్త రికార్డ్ లు నెలకొల్పారు వైసిపి చీఫ్. 14 నెలలపాటు 3648 కిలోమీటర్ల దూరం 13 జిల్లాల్లో పర్యటించి దేశంలోనే ఏ నాయకుడు సాధించలేని రికార్డ్ ఆయన నెలకొల్పారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు రికార్డ్ లను చెరిపేశారు జగన్. సుదీర్ఘ కాలం ప్రజల్లో వుంటూ మరో రికార్డ్ కూడా వైసిపి అధినేత నెలకొల్పారు.

 ఎన్నో అటు పోట్లు …

తన సుదీర్ఘ పాదయాత్ర లో జగన్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పాదయాత్ర మొదలు పెట్టకుండానే అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. సిబిఐ కోర్టు పాదయాత్రకు అనుమతి నిరాకరించింది. హై కోర్టు కి వెళ్లినా కోర్టు హాజరు నుంచి జగన్ కి మినహాయింపు లభించలేదు. దాంతో జగన్ పాదయాత్ర ఉంటుందా? ఉండదా అనే సందేహాలు పార్టీ శ్రేణులనుంచి అందరికి సందేహాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ జగన్ వెనుకడుగు వేయలేదు. న్యాయస్థానం ఆదేశాలు పాటిస్తూనే తన ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం ఉక్కు సంకల్పంతో ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపులపాయనుంచి పాదయాత్ర మొదలు పెట్టి ఇచ్ఛాపురం వరకు నిరాటకంగా సాగింది. అనేక సందర్భాల్లో అనారోగ్యానికి గురైనా జగన్ లెక్క చేయలేదు. తొలుత వెన్ను నెప్పి వేధించింది . డాక్టర్లు విశ్రాంతి తీసుకోమన్నారు వినలేదు వైసిపి అధినేత. అలాగే పాదయాత్ర కొనసాగించారు. ఆ తరువాత పాదయాత్రలో ఉండగానే జలుబు, డస్ట్ అలెర్జీ జ్వరం అనేక సార్లు వచ్చాయి . అయినా ఆయన ప్రజాసంకల్ప యాత్రలో సాగిపోయారు. విశాఖలో జగన్ పై హత్యాయత్నం జరిగింది. కోడి కత్తితో ఒక యువకుడు చేసిన దాడి తీవ్ర సంచలనం సృష్ట్టించింది. ఆ తరువాత 10 రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తన యాత్ర సాగించారు. అడుగడుగునా ప్రజలు అపూర్వ రీతిలో జగన్ సభలకు పెద్ద సంఖ్యలో హాజరౌతూ రావడం అధికార పార్టీలో ఆందోళనమొదలయ్యేలా చేసింది.

షేక్ అయిన రోడ్ కం రైలు వంతెన …

జగన్ పాదయాత్రలో హైలెట్ గా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోకి వైసిపి అధినేత ప్రవేశించిన తీరు. నాలుగున్నరకిలోమీటర్ల దూరం వున్న బ్రిడ్జి మొత్తం జనసముద్రం గా మారింది. ఫలితంగా వారధి షేక్ అయ్యింది ఏకంగా. ఆ దృశ్యాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నపార్టీకి అఖండ ఆదరణ పాదయాత్రలో కనిపించడంతో వైసిపి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జగన్ పాదయాత్ర గోదావరి జిల్లాలకు చేరుకోవడం వరకు ఒక ఎత్తు అయితే ప్రవేశించాకా వైసిపి చీఫ్ ప్రజాసంకల్ప యాత్ర మరో ఎత్తు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అదే జోష్ ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వరకు సాగి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం విశేషమే.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1682 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*