
రాజమండ్రి వైసిపిలో ఇప్పుడు సమీకరణాలు మారనున్నాయా ..? అలాగే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. వైసిపి అధినేతను రెండు సార్లు కలిసినా పార్టీలో క్రీయాశీలకం కానీ మాజీ ఏపిఐఐసి ఛైర్మెన్ శివరామ సుబ్రహ్మణ్యం తాజాగా మరోసారి జగన్ ను కలుసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. వారిద్దరి భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. అధికారీకంగా ప్రకటించకపోయినా ఇప్పటికే రాజమండ్రి సిటీ కో ఆర్డినేటర్ మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు కు టికెట్ ఖరారు అయ్యిందన్నది అందరికి తెలిసిందే. ఈ సీటుపై స్పష్టమైన హామీ లేకపోవడంతో ఇప్పటివరకు ఆగిన సుబ్రమణ్యం ఫైనల్ గా తన అనుచరులు, సన్నిహితులతో భేటీ తరువాత వైసిపి చీఫ్ ను మరోసారి కలిశారు.
ఎమ్యెల్సీ హామీతో….
గతంలో వైఎస్ జగన్ తో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో భేటీ అయ్యారు సుబ్రహ్మణ్యం. ఆ తరువాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల తరపున ప్రచారం సాగించి సైలెంట్ అయిపోయారు. కట్ చేస్తే రాజకీయ మౌన దీక్షలో వున్న ఆయన్ను అటు టిడిపి, వైసీపీలు సైతం ఆహ్వానించాయి. ఆ పార్టీలోకి వెళ్ళేది లేనిది స్పష్టత ఇవ్వకుండా ఉండిపోయారు సుబ్రహ్మణ్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమైఖ్యఆంధ్ర పార్టీ తరపున పోటీ చేసి 12 వేల ఓట్లను తన వ్యక్తిగత సామర్ధ్యంతో సాధించుకున్న ఆయన పార్టీలో చేరితే అదనపు బలం చేకూరుతుందని వైసిపి నిర్ణయించింది.
ఎమ్మెల్సీ ఆఫర్…..
దాంతో ఆయనకు అధిష్టానం పిలుపు దక్కడంతో జగన్ తో సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. వీరి ఇద్దరి భేటీలో ఎమ్యెల్సీ ఛాన్స్ ఇచ్చేందుకు జగన్ హామీ ఇవ్వడంతో మాజీ ఏపిఐఐసి చైర్మన్ సుబ్రహ్మణ్యం ఇక అధికారిక ప్రకటన జారీ చేయడమే తరువాయి. అయితే రాజమండ్రి అర్బన్ సీటును ఆశించిన సుబ్రహ్మణ్యం ఎమ్యెల్సీ ఆఫర్ ను స్వీకరిస్తారో లేదో కూడా చూడాలి.
Leave a Reply