జగన్ మౌనానికి అర్ధమేంటో.. !!

ysjaganmohanreedy-visakharailwayzone

ఎన్నికల వేళ విశాఖ వైసీపీ నేతలు మూగ నోము పట్టారు. ప్రతి సందర్భంలో పెద్ద నోరు చేసుకునే ఫ్యాన్ పార్టీ లీడర్లు సరైన సమయంలో మాత్రం కిక్కురుమనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించారు. ఆ క్రెడిట్ బీజేపీ నాయకులు తీసుకున్నారు. ఇక జోన్ ఇచ్చి 63 ఏళ్ళ చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ని లాగేశారు. దాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. ఒక ప్రధాన భాగాన్ని రాయగడ పేరిట ఒడిషాలో కొత్త డివిజన్ పెట్టి కలిపేశారు. రెండవ భాగాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేశారు. దీని మీద ఇపుడు విశాఖలోని అన్ని రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయి. మాయా జోన్ అంటూ టీడీపీ పోరాటాలు చేస్తూంటే లాభాల డివిజన్ని లేకుండా చేసి జోన్ ప్రకటించడం ఏంటని కాంగ్రెస్ సహా వామపక్షాలు గుర్రుమంటున్నాయి. అన్ని పార్టీలు కలసి గత కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టాయి.

వైసీపీ స్టాండ్ ఏంటి….?

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ విషయమై ప్రధాన పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్తేర్ డివిజన్ తో కూడిన జోన్ కావాలని అన్ని పార్టీలు కోరుతూంటే ఈ విషయంలో స్పందించాల్సిన బాధ్యత వైసీపీకి లేదా అని నిలదీస్తున్నాయి. వాల్తేర్ డివిజన్ ముక్కలు కావడం వల్ల ఇంతవరకూ అక్కడ పనిచేసిన రైల్వే ఉద్యోగులు ఇపుడు అయితే రాయగడ, లేకపోతే విజయవాడ వెళ్లిపోవాల్సివుంటుంది, కుటుంబాలను పెట్టుకుని విశాఖలో ఉన్న ఉద్యోగులంతా ఇపుడు గొల్లుమంటున్నారు. వారి మద్దతుని తీసుకోవడానికి అన్ని పార్టీలు పోరాట బాట పడితే వైసీపీ ఉలకకపోవడం ద్వారా అటు ప్రజలకు, ఇటు ఉద్యోగులకు కూడా దూరం అవుతోంది.

ఆ క్రెడిట్ పోయిందిగా…?

నిజానికి రైల్వే జోన్ కావాలని మొదట పెద్ద ఎత్తున ఆందోళన‌ చేసింది వైసీపీయే. ఆ పార్టీ సీనియర్ నేత గుడివాడి అమరనాధ్ అమరణ దీక్షలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభలో ఈ అంశంపై పదే పదే ప్రస్తావించారు. చివరకు జోన్ వచ్చింది. కానీ వాల్తేర్ డివిజన్ పోయింది. దీని మీద వైసీపీ స్పందిస్తే ఆ పార్టీ రేపటి రోజున ఎన్నికల్లో ఓట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ, వైసీపీ కుమ్మక్కు అయ్యాయని టీడీపీ, వామపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతటి కీలక‌మైన వేళ వైసీపీ తన ఆలోచనలు చెప్పి జనంలోకి రాకపోతే ఎన్నికల వేళ దెబ్బేనని అంటున్నారు. ఇక జోన్ విభజన వల్ల శ్రీకాకుళం, విజయనగరంలఒని కొన్ని స్టేషన్లు రాయగడ డివిజన్లోకి వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ విషయమై ఆందోళనలో ఉన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా స్పందిస్తే మూడు జిల్లాల్లో సానుకూలత ఉంటుందని అంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*