బెజ‌వాడ వైసీపీకి అగ్ని ప‌రీక్ష.. కొన్ని నెల‌లే స‌మ‌యం

వైసీపీ

బెజ‌వాడ వైసీపీ నేత‌ల‌కు కీల‌క అగ్ని ప‌రీక్ష ఎదురు కానుంది. మ‌రి కొద్ది నెలల్లోనే విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీలోనే అత్యంత ప్రతిష్టాత్మక‌మైన ఈ కార్పొరేష‌న్‌ను గ‌తంలో టీడీపీ దీనిని ద‌క్కించుకుంది. ఆ పార్టీ నేత కోనేరు శ్రీధ‌ర్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. అయితే.. వ‌చ్చే ఏడాది స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిజానికి బెజ‌వాడ‌లో ఇప్పటి వ‌ర‌కు వైసీపీ పాగా వేసింది లేదు. గ‌త స్థానికంలోనూ ఆశించిన సీట్లు రాలేదు. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు చోట్ల, ప‌శ్చిమ‌లో ఏడు చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో తొమ్మిది చోట్ల మొత్తంగా వైసీపీ 19 డివిజ‌న్లకే ప‌రిమిత‌మైంది.

పాగా వేయాలని….

అయితే.. ఇప్పుడు విజ‌య‌వాడ‌లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే స‌మ‌యంలో సెంట్రల్ కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. ఇక్కడ నుంచి మ‌ల్లాది విష్ణు సీనియ‌ర్ నాయ‌కుడిగా చ‌క్రం తిప్పుతున్నారు. తూర్పులో ఓడిపోయినా.. యువ నేత దేవినేని అవినాష్ మంచి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల‌ని ద్రుఢంగా నిర్ణయించుకుంది. పైగా పార్టీ అధికారంలో ఉండ‌డం.. కీల‌క‌మైన విజ‌య‌వాడ కార్పొరేష‌న్‌ను గెలుచుకుని టీడీపీని నియంత్రించాల‌ని ఇప్పటికే నిర్ణయించుకున్న నేప‌థ్యంలో ఈ ముగ్గురు నేత‌ల‌కు ప‌రీక్ష కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వీరిద్దరికీ కీలకం….

అయితే ఇక్కడ వైసీపీ గెలుపు అంత స‌ులువు కాదు. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ నేప‌థ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజ‌ల్లో వైసీపీపై ఎంతో కొంత వ్యతిరేక‌త ఉన్నది నిజం. విజ‌య‌వాడ‌లోనూ ఈ ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో వైసీపీ ఇక్కడ ఏటికి ఎదురీది గెల‌వాలి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ విష‌యానికి వ‌స్తే.. గత ఎన్నికల సమయానికి బెజవాడలో 59 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య 64కు పెరిగింది. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేవిధంగా సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అదే రేంజ్‌లో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. పైగా ప‌శ్చిమం, సెంట్రల్ లో అధికార పార్టీ నుంచి మంత్రి, బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి ఈ ఎన్నిక‌లు చాలా కీల‌కం.

టీడీపీకి బలమైన….

ఇక‌, తూర్పు నియోజకవర్గంలో పార్టీ మారి ఇన్‌చార్జ్ అయిన‌ దేవినేని అవినాష్‌ సైతం తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఇక్కడ కీల‌క‌మైన రెండు విష‌యాలు వైసీపీకి అవ‌రోధంగా మారుతున్నాయి. విజ‌య‌వాడ‌లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ మేయ‌ర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత‌ను ప్రచారం చేస్తున్నారు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం .. రాజ‌ధాని అమ‌రావ‌తి. విజ‌య‌వాడ‌కు స‌మీపంలో ఉండ‌డం. విజ‌య‌వాడ కూడా రాజ‌ధానిలో భాగంగా ఉండ‌డం. ఇప్పుడు రాజ‌ధాని త‌ర‌లిపోతే.. విజ‌య‌వాడ‌లో ఉన్న రియ‌ల్ వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోతారు.

ఈ రెండు అంశాలే….

రాజ‌ధాని మార్పు అంశంపై త‌మ జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంద‌ని న‌గ‌ర ప్రజ‌లు ఆలోచ‌న చేస్తున్నారు. దీంతో ఈ రెండు స‌మ‌స్యల‌ను స్థానిక వైసీపీ నాయ‌కులు, కార్యక‌ర్త‌లు ఎలా అధిగ‌మిస్తారు ? ఎలా ముందుకు సాగుతారు ? అన్నది చూడాలి. ఏదేమైనా బెజ‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ పై ముగ్గురు నేత‌ల‌కు అగ్ని ప‌రీక్షగా మారింద‌నే చెప్పాలి.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2674 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

1 Comment on బెజ‌వాడ వైసీపీకి అగ్ని ప‌రీక్ష.. కొన్ని నెల‌లే స‌మ‌యం

  1. The equations are changing very fast. Many people are going to vote to the BJP provided if they are fielding right candidates. In the absence of BJP it is going to be strong fight between the other parties. Many, so called choudhary’s have joined ycp as they have business interests of real estate. Ycp is doling out many freebies like one rupee houses, house sites, amma odi and many other schemes which are going to be beneficial to the lower strata people. The traditional voters of Congress are going to be in dilemma as it is nowhere in the vicinity n there is no suitable alternative BJP candidate.

Leave a Reply

Your email address will not be published.


*