గోదావరి వరద లాగా…..?

ysr-congressparty-in-east-westgodavari-districts

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ నుంచి నేటి విభజిత రాష్ట్రం వరకు గోదావరి జిల్లా ఓటరు తీర్పు ఎటు ఉంటే ఆ గాలే స్టేట్‌లోనూ ఉంటుందన్న నానుడి ఉంది. ఉభయగోదావరి జిల్లాల ఓటరు ఏ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుండడం గత మూడున్నర దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉంటూ వస్తోంది. 1994, 99 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల ఓటరు టీడీపీకి వన్‌ సైడ్‌గా తీర్పు ఇవ్వడంతో ఆ రెండు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో తెలుగుదేశమే అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో గోదావరి ఓటరు తీర్పు హస్తం వైపే ఉంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత ఎన్నికల్లోనూ ఈ రెండు జిల్లాలు మళ్ళీ సైకిల్‌కే జై కొట్టడంతో నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అసలు ఖాతాయే తెరవలేదు. తూర్పు గోదావరి జిల్లాలో 5 సీట్లతో సరిపెట్టుకుంది. రెండు జిల్లాల పరిధిలో ఉన్న 5 లోక్‌సభ సీట్లలోనూ వైసీపీకి ఒక్కటి కూడా దక్కలేదు.

సిట్టింగ్ లపై…..

ఐదేళ్ల క్రితం గోదావరి గట్టున అప్రతిహతంగా దూసుకుపోయిన సైకిల్‌స్పీడ్‌కు ఈ ఎన్నికల్లో సగానికి సగం వరకు బ్రేకులు పడ్డాయి. టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కన్నా ఈ రెండు జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే ఆ పార్టీ కొంప ముంచనుంది. జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలు తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను కాదు కదా ? చివరకు సొంత పార్టీ కేడర్‌ను సైతం పట్టించుకోలేదు. ఐదేళ్లలో కోట్లకు పడగలెత్తిన ఎమ్మెల్యేల్లో కొందరు కేడర్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడంతో పదేళ్ల పాటు పార్టీ కోసం ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న వారంతా ఎన్నికల వేళ‌ టీడీపీ అభ్యర్థుల గెలుపుకు సహకరించలేదు. ఇక ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ వర్గంగా ఉన్న కాపు సామాజికవర్గం గత ఎన్నికల్లో వన్‌ సైడ్‌గా టీడీపీకి ఓట్లు వేసింది. ఈ ఎన్నికల్లో వీరిలో చాలా మంది జనసేనకు ఓటు వేశారు.

టీడీపీకి ప్రతికూలమే….

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఆయన సోదరుడు నాగబాబు సైతం గోదావరి జిల్లాల నుంచే ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చెయ్యడంతో ఆ ప్రభావం రెండు జిల్లాల్లో చాలా నియోజకవర్గాలపై పడింది. ఇది కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతికూల అంశం. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన రెండు నియోజకవర్గాల్లో దాదాపు గెలుపు ఎడ్జ్‌లో ఉన్నట్టు పోలింగ్‌ సరళి చెబుతోంది. జిల్లాల్లో ఏలూరు, పోలవరం, నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తప్పేలా లేదు. టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటున్న దెందులూరు లాంటి చోట్ల కూడా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఏటికి ఎదురీదుతున్నాడు. ఏపీలోని 13 జిల్లాల్లో 19 నియోజకవర్గాలతో పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనూ 7 నుంచి 8 స్థానాల్లో వైసీపీకి స్పష్టంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచినా రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో ఈ సారి వైసీపీ జెండా ఎగరనుంది.

గెలుపు బాటలో…..

రంపచోడవరం, తునితో పాటు కోనసీమలో రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో వైసీపీ తిరుగులేని పోటీ ఇచ్చి గెలుపు బాటలో ఉంది. తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీ భారీగా డ‌బ్బులు వెద‌జ‌ల్లినా ఇక్కడ మ‌రోసారి టీడీపీకి ఓట‌మి త‌ప్పేలా లేదు. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్రమైన అవినీతికి పాల్పడడం, ఇసుక దందాలు ఇతర‌త్రా వ్యవహారాల్లో ఆరితేరిపోయి ప్రజలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ఓటరు స్పష్టం పోలింగ్‌లో చెప్పేశాడు. ప్రజలతో సంబంధాలు ఉండి.. ప్రజా సమస్యల పరిష్కారంలో కొంత వరకు దృష్టి పెట్టిన ఎమ్మెల్యేల పట్ల మరో సారి మొగ్గు చూపిన విధానం కూడా ఓటింగ్‌లో స్పష్టమైంది. దీనికి తోడు సహజంగానే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా వైసీపీకి కలిసి వచ్చింది. ఏదేమైనా ఈ సారి గోదావరి జిల్లా ఓటరు తీర్పు గత ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా తీర్పు మార్చినట్టే తెలుస్తోంది.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2808 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*