వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్ అయిందే….!!

ysrcongress-party-in-parchuru-constiuency

ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. ఇక్కడ గ‌తంలో వ‌రుస విజ‌యాలు సాధించిన దివంగ‌త ఎన్టీఆర్ అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు, ఆయ‌న కుమారుడు హితేష్ చెంచురామ్‌లు రాజ‌కీ యంగా కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. గ‌త కొన్నాళ్లుగా వారు వైసీపీలోకి జంప్ చేయాల‌ని చూస్తున్నట్టు వార్తలు వ‌చ్చాయి. అయితే, ఎలాంటి క్లారిటీ ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఒక‌ప‌క్క ద‌గ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో కీల‌క స్థానంలో ఉన్నారు. కేంద్రంతోనూ మంచి సంబంధాలు నెరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ ఫ్యామిలీ ఉన్నట్టుండి వైసీపీలోకి వ‌స్తుందా? అనేది సందేహంగా మారింది. దీనిపై చ‌ర్చలు కూడా సాగాయి.

చేరిక ఖాయమైందా?

అయితే, ఈ చ‌ర్చల‌కు, సందేహాల‌కు చెక్ పెడుతూ.. ఇప్పుడు ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో స్పష్టత వ‌చ్చింది. వైసీపీ పేరుతో వెలిసిన ప‌లు ఫ్లెక్సీల్లో హితేష్ చెంచురామ్‌తోపాటు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు ఫొటో కూడా ఉండ‌డంతో ఇక‌, తండ్రీ త‌న‌యులు పార్టీ మార‌డం ఖాయ‌మ‌నే విష్టయం తెలిసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంతకాలంగా దగ్గుబాటి, వైసీపీ అధినేత జగన్‌ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో దగ్గుబాటి చేరిక ఖాయమైందని వైసీపీలోని ఉన్నత స్థాయి నాయకులు చెబుతున్న సమయంలోనే పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఆయన అభిమానులు వైసీపీ ఫ్లెక్సీలపై దగ్గుబాటి, ఆయన కుమారుడి ఫొటోలు ఉంచి సోషల్‌ మీడియాలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

వారసుడి కోసం…..

అయితే, ప్రస్తుతం బీజేపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి అందులోనే ఉంటారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీని వీడి 2004లో భార్యతోపాటు కాంగ్రెస్‌లో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి గెలుపొందగా.. పురందేశ్వరి బాపట్ల, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవ ర్గాల నుంచి విజయం సాధించి యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల నుంచి దగ్గుబాటి క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కానీ, వ‌చ్చేఎన్నిక‌ల్లో త‌మ వారసుడిని ప‌రుచూరు నుంచి పోటీ చేయించాల‌ని ఆయ‌న చాప‌కింద నీరులా రాజ‌కీయాలు చ‌క్కబెట్టుకున్నారు. ఇక ప‌రుచూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అక్కడ వైసీపీ గ‌త నాలుగేళ్లుగా చుక్కాలేని నావ మాదిరిగా మారింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయన్ను ఢీ కొట్టేందుకు బ‌ల‌మైన అభ్యర్థి లేరు. ఈ క్రమంలోనే గ‌త కొద్ది రోజులుగా వైసీపీ కీల‌క నేత‌లు ద‌గ్గుపాటి ఫ్యామిలీపై వ‌ల‌వేసి వారిని పార్టీలోకి లాక్కొచ్చేందుకు విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 37160 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*