ఇక్కడ వైసీపీకి వీక్ క్యాండిడేట్ కావడంతో….??

ysrcongress party telugudesamparty

విశాఖ జిల్లాలో ఆ సీటు మీద మోజు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా అర డజను కి మించి ఒకే ఒక సీటు కోసం ఏకంగా యుధ్ధమే చేస్తున్నారు. సీటు దొరికితే చాలు మరేం అక్కరలేదు అన్నట్లుగా తమ్ముళ్ళ పోరాటం ఉంది. టీడీపీలో ప్రస్తుతం కనిపిస్తున్న సీన్ ఇది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎందుకో చాలా మందిని ఊరిస్తోంది. ఉడికిస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అది హార్ట్ ఆఫ్ ది సిటీ కావడం.

మిత్రుడికిచ్చారు…

ఈ సీటుని 2014 ఎన్నికల్లో బీజేపీకి వదిలేశారు. దాంతో ఇక్కడ బలంగా ఉండి కూడా టీడీపీ పోటీ చేయలేకపోయింది. అది లగాయితు ఈ సీటు నాదే అంటూ ప్రతీ నాయకుడు కర్చీఫ్ వేసేస్తూ వచ్చారు. అధినాయకత్వం కూడా ఇంచార్జిని పెట్టి పార్టీని న‌డిపించకుండా వదిలేయడం కూడా ఇతర నేతలకు ఆశలను కల్పించింది. ఇక ఈ సీటు కోసం ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే ట్రై చేస్తున్నారు. వారితో పాటుగా ఇదే సీటు ఇస్తే చాలు పార్టీలో కళ్ళు మూసుకుని జాయిన్ అయిపోతానంటూ మాజీ మేయర్,మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి రాయబేరాలు పెడుతున్నారు.

తమ్ముళ్ళ వార్నింగ్…..

ఇక ఈ సీటు కోసం తమ్ముళ్ళు ఇపుడు ఏకంగా అధినాయకత్వానికే వార్నింగ్ ఇస్తున్నారు. పార్టీలో ఉన్న వారిని తప్పించి బయట వారికి టికెట్లు ఇస్తే మాత్రం గెలుపు కోసం పనిచేయబోమని కూడా క్లరిటీగా చెప్పేస్తున్నారు. పార్టీలో చాలాకాలంగా ఉన్న దువ్వారపు రామారావు అనే నాయకుడైతే మరింతగా ముందుకు వెళ్ళి మాకు కాకుండా ఎవరికి టికెట్లు ఇస్తారంటూ లా పాయింట్ తీశారు. పార్టీని కాపాడుకుంటూ కష్టపడి పనిచేస్తున్న తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని కూడా డిమాండ్ చేస్తున్నారు. తన విషయంలో అధినాయకత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావంగా ఉన్నారు. ఇదే రకమైన డిమాండ్ కి మరో నేత, రియల్టర్ క్రిష్ణా రెడ్డి కూడా వినిపిస్తున్నారు. ఆయన ఏకంగా సొంత నిధులు పెట్టి మరీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక పార్టీ సభ్యత్వాన్ని కూడా బాగా చేర్పించి మంచి మార్కులు సంపాదించారు. దాంతో ఆయన టికెట్ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయన వర్గం టికెట్ తమకేనని ధీమాగా ఉంది.

అదే కారణమా…?

ఇక్కడ వైసీపీ అభ్యర్ధిగా ఉంటారని భావిస్తున్న కేకే రాజు వీక్ క్యాండిడేట్ గా ముద్ర ఉంది. ఆయన మీద గెలవడం చాలా సులువని ఇపుడు టీడీపీ నేతలు భావిస్తున్నారు. దాంతో మొదట్లో ఇక్కడ పోటీకి పెద్దగా ఆసక్తి చూపని వారు కూడా ఇపుడు క్యూ కట్టేస్తున్నారు. ఇవన్నీ చూసుకున్న సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్య విష్ణు కుమార్ రాజు కూడా జై టీడీపీ అనేస్తున్నారు. మరి అధినేత చంధ్రబాబు మదిలో ఏముందో ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30046 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*