వైసీపీదే… అవును…ఖాయం…!!!

ysrcongressparty-in-bapatla-parlament-constieuency

బాపట్ల పార్లమెంట్… నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పదిసార్లు ఎన్నికలు జరగ్గా, ఆరు సార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బాపట్ల పార్లమెంట్‌ను ఎస్సీలకు కేటాయించారు. ఇక ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉన్న పనబాక లక్ష్మి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్ధి శ్రీరాం మాల్యాద్రి పోటీ చేసి గెలుపొందారు. అయితే బాపట్ల సీటు ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రికి మరోసారి ఇచ్చేనా..? లేక అభ్యర్థిని మారుస్తారా..? అన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ అనేక తర్జనల భర్జనల తర్వాత చంద్రబాబు మరోసారి మాల్యాద్రికే టికెట్ ఇచ్చారు. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ బరిలో దిగారు.

ప్రజల్లో అసంతృప్తి….

అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాల్యాద్రిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇప్పటి వరకు పనిచేసిన ఎంపిలలో నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌కు అతి తక్కువసార్లు వచ్చిన ఎంపీగా శ్రీరామ్‌మాల్యాద్రికి పేరు. ఆయన బాధ్యతలు కూడా ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ చూస్తారని టాక్ ఉంది. పైగా ఎస్సీ రిజర్వేషన్‌పై గెలుపొందిన ఎంపీ మాల్యాద్రి కనీసం ఎస్సీ ఓటర్లను కూడా తన దగ్గరికి చేర్చుకునే ప్రయత్నంచేయకపోవడం మైనస్. అయితే ఎన్ని విమర్శలు ఉన్న మాల్యాద్రికి బాపట్ల పరిధిలో కొంత ఫాలోయింగ్ ఉంది. అలాగే బాపట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్ధులు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇదొక్కటే మాల్యాద్రికి ప్లస్ పాయింట్ కానుంది.

వైసీపీ అభ్యర్థికి….

అటు రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయినిపాలేనికి చెందిన నందిగం సురేష్‌కు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఇక 2014 మొదట్లో ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం అయిన కేసులో సురేష్‌పై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాంతో వైసీపీ అధిష్ఠానానికి సురేష్‌ దగ్గరయ్యారు. తొలుత యువజన విభాగం నాయకుడిగా సురేష్‌ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2018లో బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా పార్టీ అధిష్టానం అతన్ని ప్రకటించింది. ఇక అక్కడనుంచి పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ ఏడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేశారు. అటు పార్లమెంట్ పరిధిలో సురేశ్‌కి మంచి పరిచయాలే ఉన్నాయి. అలాగే జగన్ పాదయాత్ర, ఎంపీ మీద వ్యతిరేకత సురేశ్‌కి కలిసిరానున్నాయి.

హోరాహోరీగా…..

బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలు చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు (ఎస్సీ) ప్రకాశం జిల్లాలో ఉండగా, మరో మూడు బాపట్ల, రేపల్లె, వేమూరు (ఎస్సీ) గుంటూరు జిల్లాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో తెదేపా గెలవగా… అద్దంకి, సంతనూతలపాడు, బాపట్లలో వైకాపా గెలిచింది. చీరాలలో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఈ సారి అన్నీ నియోజకవర్గాల్లో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో మొత్తం 13,88,240 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలు 7,50,029 మంది, పురుషులు 6,83,099 మంది, ఇతరులు 117 మంది ఉన్నారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీలు 25 శాతంపైనే ఉన్నారు. అయితే మొత్తం మీద బాపట్ల పార్లమెంట్‌లో కొంత వైకాపాకే ఎడ్జ్ ఉన్నట్లు కనపడుతుంది. కానీ అసెంబ్లీ పరిధిలో తెదేపా అభ్యర్ధులు స్ట్రాంగ్ ఉండటం మాల్యాద్రికి ఓ ప్ల‌స్ పాయింట్‌.

థ్రిల్లింగ్ కంటెస్ట్…..

ప‌ర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు, వైకాపా నుంచి ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌ధ్య థ్రిల్లింగ్ ఫైట్ న‌డుస్తోంది. చీరాల‌లో ఆమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం ఫైట్ కూడా న‌రాలు తెగే ఉత్కంఠ‌లా ఉంది. అద్దంకిలో టీడీపీకి ఎడ్జ్ క‌న‌ప‌డుతోంది. సంత‌నూత‌ల‌పాడులో మాజీ ఎమ్మెల్యే బీఎన్‌.విజ‌య్‌కుమార్ (తేదేపా), వైసీపీ నుంచి సుధాక‌ర్‌బాబు మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉన్నా సుధాక‌ర్‌బాబు నాన్‌లోక‌ల్ కావ‌డం మైన‌స్ అంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో బాప‌ట్ల‌లో వైసీపీకి స్వ‌ల్ప ఎడ్జ్ ఉన్నా ఇది ఎన్నిక‌ల వ‌ర‌కు నిల‌బ‌డుతుందా ? అన్న‌ది చూడాలి. వేమూరు, రేప‌ల్లెలోనూ ట‌ఫ్ ఫైట్ ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 30230 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*