ఈసారైనా వైసీపీ గెలుస్తుందా…?

ysrcongressparty-in-kanigiri-constiuency

ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిగిరి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. కమ్యునిస్టులకు నాడు అండగా నిలిచింది. అలాంటి కనిగిరిలో ఇప్పటి వరకూ పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీగెలుపొందింది. సీపీఐ రెండు సార్లు అందలం ఎక్కింది. అలాంటి కనిగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఆసక్తి కరమైన పోరు జరుగుతోంది.

గత ఎన్నికల్లో….

కనిగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ సన్నిహితుడు, కాపు సామాజికవర్గానికి చెందిన నేత కదిరి బాబూరావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై ఏడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో కదిరి బాబూరావుకు టిక్కెట్ దక్కలేదు. ఆయనను దర్శినియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం పంపింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి చివరి నిమిషంలో టిక్కెట్ కేటాయించారు.

త్రిముఖ పోటీ అంటున్నా….

ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కనిగిరి నుంచి గెలుపొందారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది. అలాగే యాదవులు, కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలయిన బుర్రా మధుసూదన్ యాదవ్ కే టిక్కెట్ కేటాయించింది. ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జనసేన అభ్యర్థిగా వామపక్ష పార్టీకి చెందిన లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. దీంతో పోటీ ఇక్కడ రసవత్తరంగా మారింది. వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్న సానుభూతి ఉంది.

బుర్రాకే అనుకూలం…..

కదిరి బాబూరావుకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాపు సామాజిక వర్గం ఒకింత టీడీపీపై ఆగ్రహంతో ఉంది. దీంతో వారంతా జనసేన అభ్యర్థికి అండగా నిలిచే అవకాశాలున్నాయి. ఇక ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు రెడ్డి సామాజిక వర్గం అండగా నిలుస్తుండటంతో ఈ నియోజకవర్గంలో కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ కే జై కొడతారన్నది వాస్తవం. బుర్రాకు యాదవ సామాజిక వర్గాల ఓట్లు అదనపు బలం. దీంతో కాపుల ఆగ్రహం, రెడ్డి సామాజిక వర్గం అండ లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి విజయం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకే ఎడ్జ్ ఉందన్నది వాస్తవం. మరిఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 40437 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*