
ఎస్సీ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ శాతం వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఐదేళ్లుగా ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి రహదారులు, మంచినీటి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జులతో పనులు చేయించారు. ఇలా రిజర్వ్ డ్ నియోజకవర్గాలను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యంగాకన్పిస్తుంది.
ఎస్సీ నియోజకవర్గాలపై…..
అభ్యర్థుల ఎంపికలో కూడా చంద్రబాబు వీటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గంగాధర నెల్లూరులో రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి తెలుగుదేశం పార్టీ, రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం గమనార్హం.
వన్ సైడ్ ఫలితమే….
2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుమ్మడి కుతూహలమ్మ పోటీచేసి గెలుపొందారు. అప్పుడు తన సమీప టీడీపీ అభ్యర్థి గాంధీపై 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి గంగాధర నెల్లూరు నియోజకవర్గంప్రజలు కుతూహలమ్మను పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో కుతూహలమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణస్వామి పోటీ చేసి విజయం సాధించారు.వైసీపీ అభ్యర్థి నారాయణస్వామికి దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యత లభించడం విశేషం.
వైసీపీ కి దెబ్బ పడుతుందా?
ఈసారి తెలుగుదేశం పార్టీ కుతూహలమ్మకు టిక్కెట్ ఇవ్వకుండా ఆమె కుమారుడు హరికృష్ణను అభ్యర్థిగా ప్రకటించింది. కుతూహలమ్మకు జీడీ నెల్లూరులో పట్టు ఉండటంతో ఆ కుటుంబానికే సీటు ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కె.నారాయణస్వామి తిరిగి అభ్యర్ధిగా ఉన్నారు. జగన్ పాదయాత్రతో పాటు వైసీపీ వేవ్ తనను మరోసారి గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. హరికృష్ణ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తన తల్లి కుతూహలమ్మ ఇమేజ్ కాపాడుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద పూతలపట్టు లో పట్టు ఎవరికి దొరుకుతుందనేది సస్పెన్స్ గానే ఉంది.
Leave a Reply