స్పెషల్ స్ట్రాటజీ అవసరమేమో….!!

ysrcongressparty in saluru constiuency

అక్కడ టీడీపీలో మూడు వర్గాలున్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరిలో ఎవరికి టిడీపీ టిక్కెట్ దక్కినా వైసీపీ విజయం ఖాయం. కాని టీడీపీ మూడో నేతకు టిక్కెట్ కనుక ఇస్తే వైసీపీకి విజయం అంత సులువుకాదు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్పెషల్ స్ట్రాటజీ అవలంబించాల్సి ఉంటుంది. టీడీపీలో గ్రూపు విభేదాలు తమను ఈసారి కూడా గట్టున పడేస్తాయని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోనుంది. దీంతో వైసీపీని తన స్ట్రాటజీని మార్చుకుంటేనే ఇక్కడ నెగ్గుకు రాగలదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

రిజర్వ్ డ్ నియోజకవర్గమైనా….

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా రాజన్న దొర ఉన్నారు. సాలూరు ఎస్టీ నియోజకవర్గమైనా ఒడిశాకు సరిహద్దు ప్రాంతం కావడంతో విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలున్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గమైనా బీసీలు గెలుపోటములను నిర్ణయిస్తారు. కేవలం బీసీలు మాత్రమే కాకుండా కాపులు, వెలమ వంటి సామాజిక వర్గాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మక్కువ, సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాలున్న ఈ నియోజకవర్గంలో టీడీపీలో ఇప్పుడు మూడు గ్రూపులు తయారయ్యాయి. ఎవరికి వారే తమకే టిక్కెట్ అని బహిరంగంగా చెప్పుకుంటుండటం, వీధిపోరాటాలకు దిగుతుండటం వైసీపీకి కలసి వచ్చే అంశమని చెప్పక తప్పదు.

మూడు వర్గాలుగా…..

సాలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే భాంజ్ దేవ్ ను టీడీపీ అధిష్టానం నియమించింది. దీనిని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో భాంజ్ దేవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడు ఎస్టీ కాదని కోర్టు సయితం తేల్చింది. దీంతో 2006లో ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. తిరిగి ఆయనకు ఎలా టిక్కెట్ ఇస్తారని గుమ్మడి సంధ్యారాణి వర్గం ప్రశ్నిస్తోంది. అయితే గుమ్మడి సంధ్యారాణి భాంజ్ దేవ్ ను కాదని సాలూరు లో నెగ్గుకొచ్చే శక్తి, సామర్థ్యం లేదు. అంత సీన్ లేదని భాంజ్ దేవ్ వర్గం బహిరంగంగానే సెటైర్ వేస్తున్నారు.

ఆమె అభ్యర్థి అయితే….

సాలూరు టీడీపీలో వీరిద్దరి కొట్లాట ఇలా ఉండగా మూడో నేత రంగప్రవేశం చేశారు. టీడీపీ సీనియర్ నేత శోభా హైమావతి కుమార్తె, జడ్పీ ఛైర్మన్ స్వాతిరాణి ఎంట్రీ ఇచ్చారు. స్వాతి రాణికి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు ఉండటంతో ఆమెకు టిక్కెట్ గ్యారంటీ అని ప్రచారం జరుగుతుంది. సాలూరులోనే ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు. స్వాతిరాణి మెట్టినిల్లు కూడా కావడంతో ఆమె అడ్వాంటేజీ అయింది. టీడీపీ అధిష్టానం కూడా స్వాతిరాణి అభ్యర్థిత్వాన్ని సీరియస్ గానే పరిశీలిస్తుందంట. స్వాతిరాణి టీడీపీ అభ్యర్థి అయితే రాజన్న దొర చెమటోడ్చాల్సి ఉందంటున్నారు. లెక్కలు తారుమారయ్యే అవకాశముంది. స్వాతిరాణి అభ్యర్థిగా ఖరారయితే రాజన్నదొరను అరకు ఎంపీగా పంపి ఇక్కడ కొత్త వారిని బరిలోకి దింపాలన్నది వైసీపీ కొత్త స్ట్రాటజీ అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30229 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*