బద్దలు కొట్టడం ఖాయమా..??

ysrcongressparty-in-vemuru-constiuency

తెలుగుదేశం పార్టీకి అది పెట్టని కోట. వైఎస్సార్సీపీ అక్కడ కాలు మోపనేలేదు. వరస విజయాలతో దూడుకుమీదున్న తెలుగుదేశం పార్టీ ఈసారి విజయం కూడా తమదేనన్న ధీమాలో ఉంది. కానీ టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేయగలదా? టీడీపీకే ఆ నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారా? పైగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థి ఉండటంతో టీడీపీ సీటు తమదేనన్న ధీమాలో ఉంది. మంత్రిగా పనిచేయడమే తమకు కలసి వచ్చిందని ప్రత్యర్థి పార్టీ వైసీపీ అంటోంది. చివరకు ఎవరు విజేతగా నిలుస్తారో తెలియదు కానీ, ఈసారి మాత్రం టీడీపీకి గెలుపు అంత సులువు కాదన్నది మాత్రం సుస్పష్టం.

ఎవరు గెలిచినా….

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపు ఎవరదన్న చర్చ కన్నా ఇద్దరు అభ్యర్థులకు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి నక్కా ఆనందబాబు పోటీ చేశారు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో వరసగా గెలిచి ఈ ఎన్నికల్లో హాట్రిక్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే రెండుసార్లు నక్కా ఆనందబాబు పై పోటీ చేసిన మేరుగ నాగార్జున మరోసారి ఓడిపోతే హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంటారు. ఆయన 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా ఇదే నక్కా ఆనందబాబు పై పోటీ చేశారు.

కాన్ఫిడెన్స్ లేదే…

నక్కా ఆనందబాబులో అంత కాన్ఫిడెన్స్ ఈసారి కన్పించడం లేదు. పసుపు కుంకుమ వంటి సంక్షేమ పథకాలపై ఆశ ఉన్నా గెలుపు మిణుకుమిణుకుగానే కన్పిస్తోంది. పదేళ్ల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండటంతో ఆ అసంతృప్తి తనపైన ఉంటుందేమోనన్న భయం నక్కా ఆనందబాబును వెంటాడుతూనే ఉంది. అయితే సామాజిక సమీకరణల ఆధారంగా గెలుపు తనదేనని పైకి నక్కా ఆనందబాబు ధీమాగా ఉన్నారు. తాను గెలిస్తే మరోసారి మంత్రిని అవుతానని ఆయన తన ప్రచారంలోనూ చెప్పుకోవడం ప్లస్ అయిందంటున్నారు.

వేవ్ బలంగా ఉందని….

ఇక వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున గెలుపు పై నమ్మకంగా ఉన్నారు. పోలింగ్ అనంతరం విశ్లేషణలు కూడా వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. వరసగా రెండుసార్లు ఓటమి పాలు కావడంతో మేరుగ నాగార్జునపై ఈసారి సానుభూతి పెల్లుబికిందంటున్నారు. అంతేకాకుండా ఫ్యాన్ పార్టీ వేవ్ ఇక్కడ బలంగా వీయడంతో నాగార్జున గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే టీడీపీలో మాత్రం గెలుపుపై పెద్దగా ధీమా కన్పించడం లేదు. మొత్తం మీద మంత్రి గారి హ్యాట్రిక్ గెలుపునకు ఈసారి బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30180 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*