ఇక్కడ టీడీపీ మూడో ప్లేసే.. ..!

ysrcongressparty-janasenaparty-in-bhimavaram-cosnstiuency

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి భీమ‌వ‌రం కాగా మ‌రోటి గాజువాక‌. ఈ రెండు స్థానాల్లోని ఆయ‌న అభిమానులు సంబ‌రాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ప‌వ‌న్‌కు సొంత జిల్లాలో భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భీమ‌వ‌రంలో ఆయ‌న అభిమానులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పుల‌ప‌ర్తి అంజిబాబుపై విప‌రీత‌మైన వ్య‌తిరేక‌త ఉంది. ఈయ‌న స్వ‌యాన మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు వియ్యంకుడు. ఆయ‌న కూడా స‌హ‌క‌రించినా ఈయ‌న బ‌య‌ట ప‌డే ప‌రిస్థితిలో లేడు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకులేక‌పోవ‌డం, అభివృద్ధిపై స‌రైన విజ‌న్ లేక‌పోవ‌డం ఆయ‌న‌కు ప్ర‌ధాన మైన‌స్‌.

వైసీపీ, జనసేన మధ్యనే….

ఇక వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస‌రావు బ‌రిలో ఉన్నారు. ఆయ‌న ఆర్థికంగానూ బ‌లంగా ఉండ‌టంత పాటు పార్టీని గ‌త ఐదేళ్ల‌లో బ‌లోపేతం చేస్తూ వ‌చ్చారు. 2004లో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంధి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ విష‌యంలో స్ప‌ష్ట‌త ఉండ‌టంతో చాలా కాలంగా ఎన్నిక‌ల‌కు స‌మయాత్తం అవుతూ వ‌స్తున్నారు. అయితే ఇక్క‌డ ప‌వ‌న్ పోటీ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఎన్నిక‌ల స‌మ‌రం వైసీపీ-ప‌వ‌న్‌కు మాధ్యే ఉంటుంద‌ని టీడీపీ మూడో స్థానానికి ప‌డిపోతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి అట్లాంటి అవ‌కాశం ఉంద‌నే చెప్పాలి. అస‌లు పుల‌ప‌ర్తి అంజిబాబుకు టికెట్ ఇవ్వ‌ద్ద‌ని అస‌మ్మ‌తి నేత‌లు ప‌ట్ట‌బ‌ట్టి కూర్చున్నారు. అయితే గంటా ప్ర‌మేయంతోనే ఆయ‌న‌కు మ‌ళ్లీ టికెట్ అవ‌కాశం ద‌క్కింద‌నేది వాస్త‌వ‌మ‌ని కొంత‌మంది నొక్కి చెబుతున్నారు. అయితే టికెట్ అయితే తెచ్చుకోగ‌లిగారు గాని గెలుపు మాత్రం సాధ్యం కాద‌ని చెప్పుకొస్తున్నారు.

సొంత ప్రాంతం కావడంతో…..

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ భీమ‌వ‌రం నుంచే పోటీ ఎందుకు చేస్తున్నార‌ని కొంత‌మంది రాజ‌కీయ వేత్త‌లు ఆరా తీస్తున్నారు. అయితే అక్కడ స్వయంగా పర్యటించిన పవన్ భీమవరం సమస్యలపై పోరాడేందుకు.. పరిష్కరించేందుకే ఈ అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నట్టు జనసేన నేతలకు చెప్పారట.. భీమవరం డంపింగ్ యార్డ్ ఏళ్లతరబడి అలాగే ఉండడం చూసి పవన్ కలత చెందాడని జనసేన నాయకులు చెప్పుకొస్తున్నారు. భీమవరంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండడం.. రాష్ట్రంలోనే పేరున్న పట్టణం.. తన సొంత జిల్లా కావడం.. అన్ని వర్గాలతో కూడిన ప్రాంతం – అభివృద్ధి చెంది ఉండడం ఆర్థిక – సామాజిక వర్గాల్లో ఎవరికెవరూ తీసిపోకుండా ఉండడం పవన్ ను ఆకర్షించినట్టు జనసేన నేతలు చెబుతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత కాపుల ఆధిప‌త్యం ఎక్కువైంది. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వ‌స్తున్నారు. త‌న సామాజిక‌వ‌ర్గ ఓటు బ్యాంకు ఉండ‌డం, ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లు, యూత్ ఓట‌ర్ల‌పై జ‌న‌సేన ఆశ‌లు ఎక్కువుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 29997 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*