ఆ మూడు జిల్లాలు స్వీప్ అట..!!

ysrcp-inkadapa-prakasam-nellore-districts

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా ఎవరి అంచనాలు వారివే విన్పిస్తున్నాయి. అయితే అంతర్గత సర్వేలు, వివిధ సంస్థలు చేసిన సర్వేలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాటిని విడుదల చేయకపోయినప్పటికీ కొన్ని సంస్థలు తమ సర్వేల వివరాలను పార్టీలకు అందజేస్తున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పోటా పోటీగా జరిగాయి. జనసేన పోటీచేయడంతో త్రిముఖ పోటీ అనుకున్నప్పటకీ అనేక చోట్ల వైసీపీ, టీడీపీల మధ్యనే పోరు సాగిందని చెప్పాలి.

అంతర్గత సర్వేల్లో…..

అయితే మూడు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వైసీపీ తనకు అందిన సర్వేల ప్రకారం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్కసీటు కూడా రాదని ఆ సర్వే సంస్థ తేల్చిందట. ప్రధానంగా ఈ మూడు జిల్లాల్లోనే 32 సీట్లు వైసీపీ పరం అవుతాయని ఆపార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఇందులో కడప జిల్లా ఒకటి. ఇది వైసీపీ అధినేత సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఉన్న పదిసీట్లు వైసీపీ ఖాతాలోకి వెళతాయని ఆ సర్వే సంస్థ వెల్లడించిందట. జమ్మల మడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఏకమైనప్పటికీ ఆ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తుందన్నది ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం.

సొంత జిల్లాతో పాటు….

ఇందుకు ప్రధాన కారణం జగన్ సొంత జిల్లా కావడం, ఈసారి ఎలాగైనా జగన్ సీఎం కావాలని బలంగా కోరుకోవడమే క్లీన్ స్వీప్ కు కారణమంటున్నారు. కడప జిల్లాతో పాటు మరో జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ జరుగుతందని సర్వేలు తేల్చాయట. నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానమూ ఈసారి టీడీపీ గెలుచుకునే ఛాన్స్ లేదంటున్నారు. మొత్తం పది స్థానాలు గల నెల్లూరు జిల్లాలో అన్నింటినీ వైసీపీ గెలుచుకుంటుందని ఒక ప్రయివేటు సంస్థ తెలిపిందంటున్నారు. నెల్లూరు జిల్లాలో తొలి నుంచి వైసీపీకి పట్టు ఉండటంతో ఈ సర్వేపై వైసీపీ నేతలు కూడా నమ్మకంతో ఉన్నారు.

నెల్లూరు..ప్రకాశం….

వైసీపీ క్లీన్ స్వీప్ చేసే మరో జిల్లా ప్రకాశం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 12 శాసనసభ నియోజవర్గాలున్న ప్రకాశం జిల్లాలోనూ అదేపరిస్థితి ఉంటుందంటున్నారు. కానీ అద్దంకి వంటి నియోజకవర్గంలో వైసీపీ గెలిచిందంటే రాష్ట్రమంతటా కూడా వైసీపీ గాలులు బలంగా వీచినట్లే నన్నది వైసీపీ నేతల అభిప్రాయం. ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం వైసీపీ సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతుందని, ఆ పార్టీ ఏ జిల్లాలోనూ క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదంటున్నారు. మరోసారి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెబుతున్నారు. మరి వైసీపీ ఈ మూడు జిల్లాల్లో ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది మే 23వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.

Ravi Batchali
About Ravi Batchali 38976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*