ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఐరెన్‌లెగ్ హీరోయిన్ టెన్ష‌న్‌

junior ntr big boss telugu post telugu news

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నాలుగు వ‌రుస హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా వ‌చ్చిన జై ల‌వ‌కుశ సినిమా యావ‌రేజ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు కుమ్మేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా తెర‌కెక్కిస్తున్న త్రివిక్ర‌మ్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను సెట్స్‌మీద‌కు తీసుకువెళ‌తాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డేను తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే పూజా తెలుగులో చేసిన సినిమాలు చూస్తే ముకుంద‌, ఒక లైలా కోసం తాజాగా డీజే ఈ మూడు సినిమాలు స‌క్సెస్ కాలేదు. మూడు ప్లాప్ టాక్ తెచ్చుకోవ‌డ‌మో లేదా బిలో యావ‌రేజ్ అవ్వ‌డ‌మో జ‌రిగాయి.

పూజ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమాలో చేసేందుకు పూజ రెడీగానే ఉంద‌ట‌. అయితే తెలుగులో పూజ చేసిన సినిమాలు అంత‌గా క‌లిసిరాక‌పోవ‌డంతో ఇప్పుడు ఈ ఐరెన్‌లెగ్ పూజ త‌మ‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ? అన్న టెన్ష‌న్ ఎన్టీఆర్ అభిమానుల‌కు కాస్త టెన్ష‌న్‌గా మారింది. మ‌రి ఫైన‌ల్‌గా ఈ సినిమాలో పూజ‌నే ఫిక్స్ చేస్తారా ? లేదా మారుస్తారా ? అన్న‌ది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*