బాల‌య్య – నాగ్ గ్యాప్ మ‌రోసారి ఓపెన్‌

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ అక్కినేని నాగార్జున మ‌ధ్య మూడేళ్లుగా విబేధాలు ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం ఉంది. లెజెండ్రీ హీరోలు దివంగ‌త ఎన్టీఆర్‌, దివంగ‌త ఏఎన్నార్ వార‌సులుగా వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్ద‌రు హీరోలు అశేష జ‌నాభిమానాన్ని సంపాదించుకుని అగ్ర‌హీరోలుగా ఎదిగారు. అయితే స‌రైన కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌క‌పోయినా వీరిద్ద‌రి మ‌ధ్య మూడేళ్ల‌కు పైగా బాగా గ్యాప్ పెరిగిపోయింద‌న్న‌ది టాక్‌.

మ‌ధ్య‌లో ఓ సారి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు లాంటి పెద్దలు వీరి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు విఫ‌ల‌ప్ర‌య‌త్నం చేశార‌ట‌. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన టీఎస్సార్ జాతీయ అవార్డుల కార్య‌క్ర‌మం వేదిక సాక్షిగా నాగార్జున త‌మ మ‌ధ్య విబేధాల గురించి క్లారిటీ ఇచ్చాడు. బాల‌య్య‌కు త‌న‌కు ఏవో గ్యాప్ ఉన్న‌ట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయ‌ని… అవ‌న్నీ వ‌ట్టిమాట‌లే అని నాగ్ కొట్టిప‌డేశాడు. తామిద్ద‌రం ఎంతో స‌న్నిహితంగా ఉంటామ‌ని నాగ్ చెప్పాడు.

అయితే త‌మ‌పై వ‌స్తోన్న ఈ ప్ర‌చారానికి నాగ్ ఫుల్‌స్టాప్ పెట్టాల‌ని చూసినా అవి నిజం కాద‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా వీరి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విబేధాలు ఉన్న‌ట్టు ప‌లు అంశాల్లో వెల్ల‌డవుతోంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. కొద్ది రోజుల క్రితం సుబ్బ‌రామిరెడ్డి ఏర్పాటు చేసిన ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్ ఫొటో కూడా పెట్ట‌లేదు. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి సుబ్బ‌రామిరెడ్డి త‌న‌ను ఆహ్వానించినా ఆహ్వాన పత్రంలో అంద‌రి పేర్లు వేసి త‌న పేరు వేయ‌క‌పోవ‌డంతో బాల‌య్య తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌.

అప్పుడు నాగ్ స‌ర్దిచెప్ప‌పోయినా బాల‌య్య స‌రిగా స్పందించ‌లేద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక తాజాగా నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌-స‌మంత రిసెప్ష‌న్‌కు బాల‌య్య‌ను నాగార్జున‌ ప్ర‌త్యేకంగా ఆహ్వానించినా బాల‌య్య రాలేదు. దీనిని బ‌ట్టి వీరి మ‌ధ్య గ్యాప్ త‌గ్గ‌లేద‌నేది ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌. ఏదేమైనా ఈ సీనియ‌ర్ హీరోలు ఇద్ద‌రు మ‌న‌స్ప‌ర్థ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి క‌లిసిపోతే అంద‌రికి బెట‌రేమో..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*