శ్రీను వైట్ల సినిమాలు వ‌దిలేస్తున్నాడా ?

Sreenu Vaitla film with manchu vishnu

అగ్రహీరోలకు వరుస బ్లాక్‌బస్టర్లను అందిస్తూ అగ్రదర్శకుడిగా దూసుకుపోయిన శ్రీనువైట్ల ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు వెక్కిరించడంతో రేసులో వెనుకపడ్డాడు. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ చిత్రం ఆయనకు తీవ్ర‌ నిరాశను మిగిల్చింది. ఆ చిత్రం భారీ నష్టాల్లో కూరుకూపోవడంతో ఆయన ఆ నష్టాల్ని కొంత భరించాల్సి వచ్చింది. దీంతో శ్రీను వైట్ల‌తో సినిమాలు చేయాల‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు క్యూలో ఉన్న హీరోలంతా ముఖం చాటెయ్యడంతో శ్రీను కెరీర్ అయోమయంలో పడిపోయింది.

ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలకు శ్రీను వైట్ల మీద నమ్మకం పోయింది. రవితేజ శ్రీను వైట్లతో ఓ సినిమా చేయబోతున్నట్లు.. ఈ సినిమా అతి త్వరలోనే మొదలు కాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేది అనుమానంగానే ఉంది. దీంతో శ్రీను వైట్ల కెరీర్ మీద అంద‌రికి చాలా సందేహాలు వ‌చ్చేశాయి. ఇక ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం శ్రీను వైట్ల సినిమాల‌కు కొంత‌కాలం దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం.

ప్రస్తుతం వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతుండటంతో వైట్ల కూడా ఆ బాటలోనే సాగనున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వైట్లతో కలిసి వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేసిందట. కామెడీ మీద మంచి పట్టున్న వైట్లతో ఓ ఫన్నీ వెబ్ సిరీస్ చేయడానికి ఆ సంస్థ రంగం సిద్ధం చేసిందట. కొంచెం పేరున్న నటీనటులతోనే ఈ వెబ్ సిరీస్ తీయబోతున్నారట. ఇలా వెబ్ సీరిస్‌లో స‌త్తా చాటి తిరిగి సినిమాల్లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాల‌న్న‌దే వైట్ల ప్లాన్‌. మ‌రి వైట్ల వెబ్ సీరిస్‌లో స‌క్సెస్ అయ్యి మ‌ళ్లీ బుల్లితెర‌ను ఏలుతాడ‌ని ఆశిద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*