అక్షయ్ ప్లేస్ లో అనిల్ కపూర్

akshay again as vilan in shankar movie

కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ కోసం సౌత్ ఇండియా ప్రేక్షకులు బాగా వెయిట్ చేస్తున్నారు. 23 ఏళ్ళ కిందట వచ్చిన భారతీయుడు సినిమా ఎన్ని సెన్సేషనల్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాపై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

కాజల్ ప్లేస్ లో రకుల్….

షూటింగ్ బాగా లేట్ అవ్వడంతో అక్షయ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ప్లేస్ లో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శంకర్ అనిల్ కపూర్ ని కలిసి ఆయన స్టోరీ చెప్పి ఒప్పించినట్టు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సిఉంది. ఇక ఈమూవీ లో కాజల్ ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*