అందరూ అనుకున్నట్టే వచ్చేసాడు!!

గత నాలుగు రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే’ గురించే అప్ డేట్స్ ఎక్కువుగా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో ఎలా వుండబోతున్నాడు…. అసలు అందరూ అనుకున్నట్టు ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ బ్రాహ్మణుడి లుక్ ని అల్లు అర్జున్ బ్రాహ్మణుడి లుక్ ని పోలివుంటుందా అని…. తెగ ఎదురు చూస్తున్నారు. నిజంగా వారు అనుకుంటున్నట్టే ‘డీజే’ చిత్ర యూనిట్ కూడా గత రెండు రోజులుగా ‘డీజే’ ప్రీ లుక్స్ ని విడుదల చేస్తుంది. ఆ లుక్స్ లో రుద్రాక్ష, అడ్డనామాలతో ఓం అనే పదాలతో ఆ ప్రీ లుక్స్ ఉన్నాయి. అయితే సడన్ గా నిన్న శుక్రవారం డీజెలో అల్లు అర్జున్ ఎలా వుండబోతున్నాడనే సస్పెన్సు కి తెర తీస్తూ బన్నీ బ్రాహ్మణుడు పాత్రలో వున్న ఒక ఫోటో నెట్ లో హల్ చల్ చేసింది.

ఇక అల్లు అర్జున్ పక్కా బ్రాహ్మణుడులా పిలక జుట్టుతో, ఒళ్ళంతా విభూది నామాలతో జంజ్యం వేసుకుని దర్శనమిచ్చాడు. అయితే ఈ రోజు విడుదల చేసిన డీజే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ బ్రాహణుడిగా కూరగాయలను ఒక బజాజ్ స్కూటర్ మీద మోసుకెళ్తూ కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక అల్లు అర్జున్ వెనుక కూడా ఎదో అగ్రహారానికి సంబందించిన బ్యాక్ డ్రాప్ కనబడుతుంది. మరి అల్లు అర్జున్ కేవలం ఒక్క బ్రాహ్మణ పాత్రనే పోషిస్తున్నాడా.. అనే డౌట్ క్రియేట్ చేసాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పటికే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రంలో రెండు పాత్రల్లో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

మరి ఒక పాత్ర లుక్ ని రిలీజ్ చేసి మరో పాత్రని హైప్ చేసారా అనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి డీజే ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలను అయితే పెంచేశారు అల్లు అర్జున్ – హరీష్ శంకర్ లు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*