అక్కడ ‘అలా’ కి పోటీ లేదబ్బా..!!

మహేష్ బాబు శనివారం సరిలేరు నీకెవ్వరూ అంటూ మాస్ హిట్ కొడితే.. ఒక రోజు లేట్ గా అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక అప్పటినుండి రెండు సినిమాల కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియా వార్ జరిగితే ఓకె.. కానీ నిర్మాతలే మా సినిమాకి ఇంతొచ్చింది, అంతొచ్చింది అంటూ పోస్టర్స్ మీద పోస్టర్స్ విడుదల చేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మహేష్ గొప్ప అంటే అల్లు అర్జున్ గొప్ప అంటూ ఇద్దరి హీరోల ఫాన్స్ సోషల్ మీడియా వార్ పీక్స్ లో ఉంటే.. హైయ్యెస్ట్ గ్రాసర్స్   అంటూ పోస్టర్స్ యుద్ధం మొదలయ్యింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా అటుఇటుగా రెండు సినిమాలు కలెక్షన్స్  ఉంటున్నాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం అల్లు అర్జున్ సరిలేలు నీకెవ్వరుని పడుకోబెట్టేసాడు.

అలా వైకుంఠపురములో ఇప్పటికే  2 మిలియన్ క్లబ్బులో చేరడమే కాదు.. అసలు…. మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ మార్కును చేరుకోవడం సందేహంగానే ఉంది. ఇక అలా వైకుంఠపురములో సినిమాకి రెండో వీక్ లోను కలెక్షన్స్ దూసుకుపోవడమే కాదు.. 2.5 మిలియన్ మార్కును కూడా ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది అంటున్నారు. త్రివిక్రమ్ మాయ, అల్లు అర్జున్ కత్తిలాంటి స్టయిల్ అన్ని అలా వైకుంఠపురములో కలెక్షన్స్ ఫుల్ సపోర్ట్ చెయ్యడము, త్రివిక్రమ్ కి ఓవర్సీస్ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో అలా వైకుంఠం.. అలా అలా దూసుకుపోతుంది. ఇక యుఎస్ లో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన త్రివిక్రమ్ పాట సినిమా అ.. ఆ ని దాటి అలా వైకుంఠపురములో దూసుకుపోవడం మాత్రం పక్కాగా కనబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*