అదరహో బాహుబలి!!

బాహుబలి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా… అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ రోజు ఉదయం ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలతో పిచ్చెక్కిపోయింది. అలా వుంది ‘బాహుబలి ద కంక్లూజన్’ ట్రైలర్ లో. అసలు సినిమా చూసినంత ఫీల్ కలిగిందంటే అది రాజమౌళి గొప్పతనమే అని చెప్పాలి. ఈ రోజు ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బాహుబలి ట్రైలర్ ని థియేటర్స్ లో విడుదల చేశారు. అలా థియేటర్స్ లో బాహుబలి ట్రైలర్ వస్తుందో లేదో ఇక్కడ సోషలో మీడియాలో దాని ప్రభంజనం స్టార్ట్ అయ్యింది.

ఇక ‘బాహుబలి 2 ‘ ట్రైలర్ మాత్రం ‘బాహుబలి పార్ట్ 1 ‘ సినిమా కంటే వీర లెవెల్లో అదిరిపోయిందని చెప్పాలి. అంతకుమించి… అనిపించేలా ఈ ‘బాహబలి 2 ‘ ట్రైలర్ ని కట్ చేసి తనకెవరూ సాటిరారు అని నిరూపించాడు రాజమౌళి. అసలు బాహుబలి 1 ని అసంతృప్తిగా చూపించి కొద్దిగా నిరాశ పరిచిన రాజమౌళి ఈ ‘బాహుబలి పార్ట్ 2 ‘ లో మొత్తం కథనంతా చెప్పి అందరికి సంతృప్తి కలిగించాలని భావించినట్టున్నాడు. అందుకే అమరేంద్ర బాహుబలి ప్రభాస్ ని, భల్లాల దేవా రానాని , దేవసేన అనుష్కని, తమన్నా ని, కట్టప్పని,రాజమాత రమ్య కృష్ణ ని ఎలా చూపించాలో అలా చూపించి అరిపించేసాడు. యుద్ధం సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ తో మొత్తం కలగలిపి ‘బాహుబలి 2 ‘ ని అదరహో అనిపించేలా తెరకెక్కించాడని అర్ధమవుతుంది.

మరి బాహుబలి 2 ట్రైలర్ తోనే రాజమౌళి ఇప్పటివరకు ఉన్న అంచనాలను అమాంతం గా 1000 రేట్లు పెంచేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి ఏప్రిల్ 28 న సిద్దమవుతున్నాడు. ఒక్క బాహుబలి 1 తోనే సంచలనాలు నమోదు చేసిన రాజమౌళి అండ్ టీమ్ పార్ట్ 2 తో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో ఒక్క నెల రోజులు ఓపిక పడితే తెలిసిపోతుంది. ఈ సినిమాకి కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. ప్రతి ఒక్క కేరెక్టర్ ఆద్యంతం అలరిస్తుందని ట్రైలర్లోనే తెలిసిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*