అబ్బో అదిరిపోయే ఆఫర్!!

అల్లు అర్జున్ ఈ మధ్యన మంచి దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వరసబెట్టి సినిమాలు చేస్తూ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘డీజే’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర టీజర్ తాజాగా మహా శివరాత్రి సందర్భం గా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విడుదల చేసిన దగ్గర నుండి యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం మొదలు పెట్టినప్పటినుండే అంచనాలు పెంచుకుంటూ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అల్లు అర్జున్ క్రేజ్ ని తెలియజెప్పే బిజినెస్ ఈ చిత్రం జరుపుకుంటుందని అంటున్నారు. ఒక్క బిజినెస్ మాత్రమే కాకుండా ఇప్పుడు మరో విషయంలో కూడా ‘డీజే… దువ్వాడ జగన్నాథం’ చిత్రం రికార్డు నెలకొల్పినట్లు చెబుతున్నారు. ‘డీజే’ సాటిలైట్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ‘డీజే’ చిత్ర శాటిలైట్స్ హక్కుల కోసం 18 కోట్లు ఆఫర్ చేసిందని చెబుతున్నారు. మరి ఈ ఫిగర్ చూస్తుంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏమిటో అర్ధమవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా పూజ హెగ్డే అల్లు అర్జున్ కి జోడిగా నటిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*