అబ్బో బాగానే రియాక్ట్ అయ్యాడుగా!!

మహేష్ బాబు

పూరి జగన్నాధ్, మహేష్ బాబు హీరోగా ‘జనగణమన’ చిత్రం చెయ్యాలని ఆశపడి ఆ చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా తయారు చేయించి మీడియాకి పంపించాడు. ఇక ఎలాగూ మహేష్ కి ‘పోకిరి, బిజినెస్ మన్’ వంటి హిట్స్ ఇచ్చిన పూరి తో సినిమా చెయ్యడానికి సానుకూలం గా వున్నాడు. అయితే పూరి ‘జనగణమన’ అన్న తరవాత పూరి తీసిన చిత్రాలన్నీ వరసగా ప్లాప్ అవడం తో మహేష్ ఇక పూరి తో చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఎలాగైనా మహేష్ తో సినిమా చెయ్యాలని మడి కట్టుకు కూర్చున్న పూరికి ఈ మధ్యన  మహేష్ ఇన్ డైరెక్ట్ గా షాక్ ఇచ్చాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు తానూ చెయ్యబోయే వరుసగా మూడు సినిమాల వివరాలను ట్వీట్ చేసి పూరీని హర్ట్ చేసాడు.

అయితే పూరి మాత్రం మహేష్ తీరుకు ఆ మధ్యన ఎప్పుడో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో….. కథ చెప్పాను.. చేద్దామన్నాడు.. తర్వాత మాత్రం ఏం స్పందన లేదు. దానికి నేనేం చేస్తాను…. అంటూ అసహనం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే కొంచెం లేట్ గా అయినా మహేష్ షాక్ నుండి తేరుకున్న పూరి ఇప్పుడు ‘జనగణమన’ కథని వేరో హీరోకి వినిపించగా ఆ సీనియర్ హీరో ఆ కథని ఒకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు వెంకటేష్. ఇప్పటికే పూరి, వెనకటేష్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఇక ఆ సినిమానే ‘జనగణమన’ కథతో తెరకెక్కుతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాకి వెంకీ నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. సగం సురేష్ బాబు పెట్టుకోగా మిగతా సగం వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వినబడుతోంది.

అంటే పూరి, మహేష్ కి కౌంటర్ ఇచ్చినట్లేగా….. ఇక వెంకటేష్ తో గనక ‘జనగణమన’ తీసి హిట్ కొడితే తర్వాత మహేష్ పాపం బాధపడతాడేమో కదా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*