అభిమానులకు అంకితం ఇచ్చిన పవర్‌స్టార్‌….!

Telugu news telugu post news

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కు ఆయన అభిమానులంటే చాలా ఇష్టం. వారి కోసం ప్రాణాలైనా ఇచ్చే మనస్తత్వం. అదే విధంగా పవన్‌కు సైతం ఆయన అభిమానుల పిచ్చిగా ఆరాధిస్తారు. పవన్‌ కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉంటారు. తనకు వీలున్నప్పుడల్లా తన అభిమానుల గురించే ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా ఆయన తాను ఎంతో కష్టపడి, అన్నితానై వ్యవహరిస్తున్న ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’ చిత్రాన్ని తన అభిమానులకు ఆయన అంకితం ఇచ్చారు. ఈ విషయాన్ని ఈ చిత్ర మరో నిర్మాత శరత్‌మరార్‌ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థుల్లోనూ ఏప్రిల్‌8వ తేదీనే రిలీజ్‌ చేయాలనే గట్టి పట్టుదలతో పవన్‌ ఉన్నాడు. దీంతో షూటింగ్‌ను మరింత వేగవంతం చేయాలని ఆయన యూనిట్‌ను ఆదేశించారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఐదు లోకేషన్లలో ఐదు యూనిట్లతో జరుపుకుంటోంది. పవన్‌కళ్యాణ్‌తో సహా మిగిలిన ముఖ్య తారాగణంపై తీయాల్సిన మేజర్‌పార్ట్‌ను దర్శకుడు బాబి పర్యవేక్షణలో షూటింగ్‌ జరుపుకుంటుంటే మిగిలిన సీన్లను, ప్యాచ్‌వర్క్‌ను, ఇతర సన్నివేశాలను ఆయన యూనిట్‌లోని కోడైరెక్టర్లు, అసోసియేట్‌ దర్శకుల పర్యవేక్షణలో షూటింగ్‌ జరుపుతున్నారు. మొత్తానికి ఈ చిత్రం ఏప్రిల్‌ 8న విడుదలయ్యే అవకాశం లేదని, ఇంకా షూటింగ్‌ పార్ట్‌ పూర్తికాలేదని వస్తున్న వార్తలకు పవన్‌ ఈ నిర్ణయంతో చెక్‌ పెట్టినట్లుగా భావించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*