అమ్మడు లెట్స్ డూ కుమ్ముడుకి చెర్రీ స్టెప్పులు

మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టి అందరిని ఆశ్చర్య పరచటమే కాకుండా రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు వినూత్న ప్రచారాలతో ఖైదీ నెం.150 చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకు వెళ్తూ ప్రచార కార్యక్రమాలలోనూ వినూత్న శైలి ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్ నిర్వహించిన ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ సక్సెస్ కాగా ఇప్పుడు చెర్రీ సినిమాని ప్రేక్షకులకు ఇంకా చేరువ చేయటానికి సోషల్ మీడియా లో లైవ్ చాట్స్ ద్వారా ఇంటర్వూస్ ద్వారా అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడు. నేడు(బుధవారం) విడుదలవుతున్న ఖైదీ నెం.150 సినిమా విశేషాలు పేస్ బుక్ లైవ్ ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో ముచ్చటించటానికి రామ్ చరణ్ హైద్రాబాద్ నగరంలోని పేస్ బుక్ కార్యాలయానికి విచ్చేశాడు.

ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 30 నిమిషాల పాటు లైవ్ ఇంటర్వ్యూ లో తాను నటించబోయే తదుపరి చిత్ర వివరాలతో పాటు తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి నటించబోయే చిత్రాల గురించి మాట్లాడిన చెర్రీ, ఖైదీ నెం.150 పై వున్న పాజిటివ్ బజ్ ని మరింత పెంచుతూ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ అనంతరం పేస్ బుక్ కార్యాలయంలోని ఒక ఉద్యోగి చెర్రీ తో కలిసి డాన్స్ చెయ్యాలని ఉందని అడగటంతో చెర్రీ ఆవిడ కోరికను మన్నిస్తూ అదే కార్యాలయంలో పనిచేస్తున్న యువతులతో కలిసి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు కాలు కదిపాడు. వారిలో ఒక అమ్మాయి చేస్తున్న డాన్స్ మూవ్మెంట్స్ లోని ఈజ్ చూసి ఆశ్చర్య పోయిన చరణ్ తనతో సమానంగా డాన్స్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలని, కొంచం తేలిక స్టెప్స్ తో డాన్స్ చేద్దామని కోరి మరీ ఈజీ స్టెప్స్ తో నాట్యం చేసి అందరిని అలరించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*