అల్లు అర్జున్ షో స్టీలర్ అంటున్న దర్శకుడు

అల వైకుంఠపురములో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది ఇచ్చిన బ్లాక్ బస్టర్ సరైనోడు తో ఆయన క్రేజ్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. అల్లు అర్జున్ చేయబోయే తదుపరి చిత్రాల కోసం మెగా అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అందులోనూ కమర్షియల్ సినిమాలలో ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరో కారెక్టరైసెషన్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు హరీష్ శంకర్ తెరకేక్కిస్తున్న దువ్వాడ జగన్నాథం అయితే కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు మెగా అభిమానులు. గతంలో హరీష్ శంకర్ మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ తో పాటు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయం ఇవ్వటంతో ఇప్పుడు ఆయన దర్శకత్వం వహిస్తున్న దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్ ఎలా చూపిస్తాడో అని ఆతృతగా వున్నారు అభిమానులు.

హరీష్ శంకర్ మాత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా పకడ్బందీగా చేసుకుని చిత్రాన్ని పట్టాలెక్కించినట్టున్నారు. చిత్రం మొదలై మూడు నెలలు కూడా పూర్తి కాకముందే మూడు రెగ్యులర్ షెడ్యూల్స్ పూర్తయ్యి నాలుగో షెడ్యూల్ మొదలైపోయింది. నాలుగో షెడ్యూల్ లో హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో చేయనున్న పోరాట సన్నివేశాలు మరియు కొన్ని కీలక సన్నివేశాలతో టాకీ పార్ట్ పూర్తవనుంది. అప్పటి వరకు ఆగకుండా హరీష్ శంకర్ జరిగిన మూడు షెడ్యూల్స్ తాలూకా ఫ్యూటేజి కి ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టించేశాడు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ అనుభవంతో కచ్చితంగా అల్లు అర్జున్ షో స్టీలర్ గా నిలుస్తాడని చెప్పి ఎడిటింగ్ పనులకు నాంది పలుకుతూ తీసిన మోనిటర్స్ ఫోటో తో ట్విట్టర్ లో అభిమానులకు పంచుకున్నాడు ఈ దర్శకుడు.

ఈ ఏడాది వేసవికి మెగా అభిమానులకు ఫీస్ట్ ఇవ్వటానికి సిద్దమవుతుంది దువ్వాడ జగన్నాథం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*