ఆఫీషియల్ అంట!!

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం సినిమా గురించి జరిగిన ప్రచారం మరే ఇతర సినిమాకి జరిగిఉండదు. ఆ సినిమా విడుదలై అప్పుడే ఒక వారం గడిచిపోయింది కూడా. అయినా కూడా ఆ సినిమాపై విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇంతగా పబ్లిసిటీ అవడానికి అల్లు వారి టెక్నీక్ ఒక కారణమైతే మరొకటి సినిమాకొచ్చిన టాక్ కూడా ఒక కారణం. డీజే చిత్రం విడుదలయ్యాక ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుని సినిమా అపోయిందని అన్నారు.

అల్లు అర్జున్ – పూజ హెగ్డే జంటగా నటించిన డీజే రివ్యూ లు కూడా అన్ని నెగెటివ్ గానే వచ్చాయి. మరి అంతగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా చిత్రం బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది అంటే అస్సలు నమ్మబుద్ది కావడంలేదు కదూ… కానీ డీజే చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ సినిమా హిట్ అనే భావన తెప్పించేసింది. ఎక్కడో అనుమానం ఉన్నవారికి కూడా ఇప్పుడు విడుదలైన డీజే పోస్టర్స్ చూస్తే ఆ అనుమానాల్ని తొలిగిపోతాయి. ఇక చిత్ర టీమ్ అధికారికంగా డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టు పోస్టర్స్ ని మీడియా కి వదిలింది.

మరి సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంపై డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజులూ డీజే థాంక్స్ మీట్ లో కాస్తంత అసహనం వ్యక్తం చెయ్యడం తెలిసిందే. మరి అంతలా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ… అలాగే డీజే చిత్రం పైరసీ అయినప్పటికీ ఇలా 100 కోట్ల గ్రాస్ తేవడమనేది మామూలు విషయం కాదు. మరి ఇలా 100 కోట్ల క్లబ్బులో డీజే చేరడంతో డైరెక్టర్ గారు సభ్యసమాజానికి ఒక థాంక్స్ పడేసారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*