ఆ సినిమా ఇక లేనట్టేనా?

allu arjun movie release date

అల్లు అర్జున్ ‘డీజే’ సినిమా షూటింగ్ లో ఉండగానే తమిళ దర్శకుడు లింగుస్వామితో బైలింగ్యువల్ చిత్రానికి పూజ కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే ‘డీజే’ చిత్రం కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటాడని అనుకున్నారంతా. అయితే అల్లు అర్జున్ ఆ ఎనౌన్సమెంట్ అయితే చేసాడు గాని….. తర్వాత ఆ చిత్రంపై ఎటువంటి న్యూస్ బయటకి రాలేదు. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త అతనికి డైరెక్టర్ గా అవకాశం ఇస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. రైటర్ వక్కంతం వంశీ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని చెయ్యడానికి దాదాపు అల్లు అర్జున్ రెడీ అయ్యాడనే మాట వినిపిస్తుంది.

అంటే లింగుస్వాతో చేసే చిత్రాన్ని ఆపేసేడా? లేక హోల్డ్ లో పెట్టాడో తెలియదు గాని ప్రస్తుతానికైతే ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనబడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవడానికి కొన్ని కారణాలున్నాయని అంటున్నారు. అల్లు అర్జున్ సైడ్ నుండి ఈ సినిమాకి ఇబ్బంది ఏం లేకపోయినా ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి యేవో ఇబ్బందులు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దర్శక – నిర్మాతల మధ్యన ఏర్పడిన విభేదాల వల్లే ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణాలుగా తెలుస్తుంది. ఇక ఆ విభేదాలను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో దాదాపు అల్లు అర్జున్ – లింగుస్వామి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే సిట్యువేషన్ లో ఉందనే టాక్ వినబడుతుంది.

అందుకే అల్లు అర్జున్ కూడా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడట. ఇక డీజే షూటింగ్ ఫినిష్ అవ్వగానే వక్కంతం వంశి డైరెక్ట్ చెస్ చిత్రాన్ని పట్టాల్క్కించే పనిలో రెడీగా వున్నాడని అంటున్నారు. ఇక ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని ఏప్రిల్ 8 నుండి పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో బన్నీ వున్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*