ఇక్కడ హీరో అక్కడ జీరో!!

చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్

మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుని అక్కడ కుదరక మళ్ళీ సినిమా రంగమే బెటర్ అనుకుని దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించడానికి వచ్చాడు. అయితే టాలీవుడ్ లో వెండితెర మీద నటిస్తూనే ఇటు బుల్లితెర మీద కూడా తన హవా కొనసాగించడానికి రెడీ అయ్యాడు. వెండితెర మీద ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో సూపర్ సక్సెస్ సాధించి మళ్లీ వెండితెర మీద తనకి తిరుగులేదని మరోమారు రుజువు చేసాడు. అలాగే బుల్లితెరమీద కూడా గతంలో నాగార్జున హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడికి హోస్ట్ గా తెర మీదకి వచ్చాడు. వెండితెర మీద సక్సెస్ అయిన చిరు బుల్లితెర మీద సక్సెస్ సాధించలేకపోయాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు మా టీవీలో ప్రసారమవుతుండగా… ఆ షో మొదలు పెట్టి చాలా రోజులు కావస్తున్నా టీఆర్పీ రేటింగ్స్ లో ఏ మార్పు లేదు సరికదా ఇంకా డౌన్ అవుతుందనే కామెంట్స్ వినబడుతున్నాయి.

నాగార్జున స్టయిల్, మాటతీరు తో మీలో ఎవరు కోటీశ్వరు సూపర్ సక్సెస్ అయ్యింది. మరి మెగా స్టార్ చిరంజీవి క్రేజ్ తో ఇప్పుడు కూడా అలాగే అవుతుందనుకున్న మా టీవీ యాజమాన్యానికి మెగా స్టార్ చిరు షాక్ ఇచ్చాడు. చిరు వాయిస్ లో గ్రెస్ లేకపోవడం ఒక కారణమైతే ఈ షోలోకి వచ్చేవారు మధ్యతరగతి, సామాన్య ప్రజలు తమ ఆర్ధిక స్థితిగతులతోపాటు…. వ్యక్తిగత విషాద ఘట్టాలను హైలైట్ చేస్తూ దీన్ని జట్కాబండి షో స్థాయికి దిగజారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి బాధలు చెప్పే వాటిని సాల్వ్ చేస్తున్న బతుకు జట్కా బండి, రచ్చబండ వంటి ప్రోగ్రామ్స్ కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ రావడం… చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి టీఆర్పీ పడిపోవడంపై… చిరు గ్లామర్ గాని క్రేజ్ కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు రేటింగ్స్ పెంచలేవని ఫిక్స్ అయిపోయారట.

మరి బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడుని చిరు క్రేజ్ ని నమ్ముకుని కొనసాగించడం కరెక్ట్ కాదేమో అని మాటీవీ వారు ఒకసారి ఆలోచించుకుంటే బావుంటుందని అంటున్నారు. మరి వెండితెర మీద వెలుగులు జిమ్మిన చిరు బుల్లితెర మీద వెలుగు చిమ్మలేక పూర్తిగా విఫలమయ్యాడన్న మాట. ఇకపోతే ఇప్పుడు చిరు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తన 151 వ చిత్రాన్ని ప్రారంభిచడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*