ఇలాంటి రోల్ సమంత ఎందుకు వదులుతుంది?

సమంత

ఈమధ్యన సమంత చేసే కేరెక్టర్స్ ఆమెకి ఛాలెంజ్ విసురుతున్నాయి. పెళ్లి తర్వాత సమంత స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ షో చేస్తూ ఉండిపోకుండా తనకి ప్రాధాన్యమున్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. గ్లామర్ షో అంటూ హీరో పక్కన కాసేపు నిలబడే పాత్రల్ని సమంత లైట్ తీసుకోబట్టే ఆమె చేతిలో సినిమాలు లేవు. యూటర్న్, మజిలీ, ఓ బేబీ, జానూ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన పాత్రలు ఉంటె తాను తప్పక నటిస్తా అంటూ దర్శకనిర్మాతలకు సవాల్ విసురుతుంది. ఇక అలాంటి కేరెక్టర్స్ కి సమంత బెస్ట్ ఆప్షన్ అంటూ దర్శకులు ఫిక్స్ అయ్యేలా కనబడుతున్నారు.

తాజాగా సింగీతం శ్రీనివాస్ ఓ బయోపిక్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ప్రస్తుతం బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ అనే దేవ‌దాసి క‌థ‌ని సినిమాగా మలిచే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్న సింగీతంకి బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్రకి ఏ హీరోయిన్ అయితే బావుంటుంది అనే ఆలోచన రాగానే ముందుగా ఆయన మదిలోకి సమంత నే వచ్చిందట. ఇలాంటి కేరెక్టర్స్ ని అలవోకగా అదరగొడుతున్న సమంత బెంగ‌ళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర కి పర్ఫెక్ట్ అని… అందుకే కరోనా  ప్రభావం వదలగానే ముందు సింగీతం సమంత ఇంటి తలుపు తట్టాలని ప్లాన్ లో ఉన్నాడని అంటున్నారు. అయితే సమంత గనక కాదంటే మరో హీరోయిన్ గురించి ఆలోచిస్తారట. అయితే సమంత మాత్రం ఇలాంటి పాత్రలను ఎందుకు వదిలేస్తుంది. తనకిష్టమైన పాత్రలను సమంత అస్సలు వదులుకోదు… మరొకరికి ఛాన్స్ ఇవ్వదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*