ఇవి నందమూరి హీరోకి నచ్చిన సినిమాలంట

kalyan ram next movie story
స్వర్గీయ నట రత్న నందమూరి తారక రామారావు గారి మూడవ తరం నట వారసుడిగా వచ్చి కథానాయకుడిగా, నిర్మాత గా కొనసాగుతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా సంవత్సరాలు అపజయాలతోనే సహవాసం చేసి ఈ మధ్యనే పటాస్, ఇజమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యారు కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదల ఐన ఇజమ్ చిత్రం నెగటివ్ టాక్ తో మొదలైనప్పటికీ వసూళ్ల విషయంలో వెనుక అడుగు వెయ్యలేదు. ఆ చిత్రాన్ని మరింత ప్రచారం చేసి విజయ కేతనం ఎగురవేయటానికి దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు, నిర్మాత కళ్యాణ్ రామ్ అదే పనిగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ ని ఒక పత్రికా విలేకరి బాగా నచ్చిన చిత్రాల గురించి అడగగా, “ఈ తరం చిత్రాలలో నాకు థియేటర్లో చూస్తున్నప్పుడు వెంట్రుకలు లెగిసి నిలబడ్డ చిత్రం బాబాయ్ నటించిన సింహ చిత్రమే. తమ్ముడు తారక్ నటించిన రాఖి చిత్రం కూడా ఇష్టమే. ఆ చిత్రంలో తారక్ కనబరిచిన నటన అద్భుతం. ఇక పాత తరం లో తాత గారి చిత్రాలలో నచ్చిన చిత్రం ఒకటి అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. మిస్సమ్మ, గుండమ్మ కథ చిత్రాల సమయంలో తాత గారు చాలా బాగుండేవారు. ఆ కాలంలో చిత్రాలు దాదాపు అన్ని నచ్చుతాయి.” అని తన కుటుంబ కథానాయకుల పై అభిమానాన్ని చాటి చెప్పాడు కళ్యాణ్ రామ్.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇజమ్ మొదటి మూడు రోజులలో ఏడూ కోట్లకు పైగా వసూళ్లు సాధించి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా నిలిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*