ఈసారి అలా కుదరదు

టాలీవుడ్ లో ఎదురులేని తిరుగులేని డైరెక్టర్ ఎవరయ్యా అంటే వెంటనే ముక్తఖంఠంతో అందరూ రాజమౌళి పేరే చెబుతారు. మరి ఆయనకున్న ట్రాక్ రికార్డు అలాంటిది. రాజమౌళి కున్న క్రేజ్ చూసిన అందరూ ఆయనతో ఒక్కసారి సినిమా చేస్తే బావుండు అనుకుంటారు. ఎన్టీఆర్ అయితే ఎప్పటికప్పుడే జక్కన్న దయ అనేవాడు. అలాంటి రాజమౌళి కథ చెప్పకుండా మీతో సినిమా చేస్తాను అంటే వాళ్ళు ఆయనతో సినిమా చేసేందుకు రెడీ గా ఉంటారు. రాజమౌళి మీద అంత నమ్మకం స్టార్ హీరోలకు. అసలు రాజమౌళి నుండి సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్. ఇపుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

మరి ఎన్టీఆర్ తో సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ తీస్తే… రామ్ చరణ్ మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. మరి ఇప్పుడు రాజమౌళి చరణ్ కి చెప్పిన కథ అయన తండ్రి చిరుకి కూడా చెప్పి చరణ్ తో సినిమా చెయ్యడానికి ఒప్పించాడా అనే డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే చరణ్ సినిమా సెట్స్ మీదకెళ్ళాలి అంటే అన్ని విషయాలు చిరు దగ్గరనుండి పర్మిషన్ తీసుకోవాలనే నానుడి ఉంది. ఆ సినిమా స్క్రిప్ట్ అంతా చిరు చూసాకే లాక్ చెయ్యాలి. ఒకవేళ చిరు ఎమన్నా మార్పులు చేర్పులు చెబితే ఆ దర్శకుడు మారుమాట్లాడకుండా చెయ్యాలి అది మెగాస్టార్ పవర్.

మరి ఇప్పుడు రాజమౌళి కూడా చిరుకి కథ చెప్పాడా లేదా అనే డౌట్ అందరిలో మొదలైంది. మరి రాజమౌళి ఏం చేసినా అది తనకి నచ్చినట్లుగా చేస్తాడు. అలాగే టెక్నీషియన్స్ విషయాల్లోనూ అంతే. తనకి ఎలాంటి వారు కావాలో అలాంటి వారినే పెట్టుకుంటాడు. మరి ఎవరి మాట వినకుండా తన డెసిషన్ తానే తీసుకునే త్తత్వం ఉన్న రాజమౌళి ఇప్పుడు చరణ్ కోసం చిరుకి మొత్తం కథ చెప్పాడా లేదా…. చిన్నగా ఒక స్టోరీ లైన్ వినిపించి సైలెంట్ గా తన పని తానూ చేసుకుంటున్నాడా అంటూ ఫిలింనగర్ లో వినబడుతున్న హాట్ టాపిక్ ఇప్పుడు. మరి కథలో ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎన్టీఆర్ కి, చరణ్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ చరణ్ కి ఇచ్చాకే ఈ సినిమా విషయం బయటికి చెప్పాడు రాజమౌళి. లేకపోతె అటు మెగా, ఇటు నందమూరి అండ్ ఎన్టీఆర్ ఫాన్స్ నుండి సమస్యలొస్తాయని ఈ దర్శకుడికి ముందే తెలుసులే అంటున్నారు కొందరు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*