ఈసారైనా బన్నీ మాట నిలబెట్టుకుంటాడా…?

అల్లు అర్జున్ allu arjun

సామాన్యంగా మన స్టార్‌హీరోలు చాలామంది దర్శకులకు సినిమా చేస్తామని మాట ఇస్తుంటారు. కానీ ఆ దర్శకులు చేసే తాజా చిత్రాలు సక్సెస్‌ అయితేనే ఆ ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కుతాయి. ఫలితంలో ఏ మాత్రం తేడా వచ్చినా వారికి మన స్టార్స్‌ హ్యాండిచ్చేస్తారు. గతంలో ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంతో రాత్రికి రాత్రి స్టార్‌ దర్శకునిగా మారిపోయిన హరీష్‌శంకర్‌తో ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చిన బన్నీ ఆ తర్వాత ‘రామయ్యా..వస్తావయ్యా’ ఫ్లాప్‌తో హరీష్‌శంకర్‌కు హ్యాండిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలైన మెగాస్టార్‌ చిరంజీవితో ‘అందరివాడు’, రామ్‌చరణ్‌కు ‘బ్రూస్‌లీ’ వంటి ఫ్లాప్స్‌ ఇచ్చిన శ్రీనువైట్ల ప్రస్తుతం మెగాకాంపౌండ్‌ హీరో వరుణ్‌తేజ్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆమద్య శ్రీనువైట్ల బన్నీకి ఓ స్టోరీలైన్‌ వినిపించాడట. ఆ స్టోరీలైన్‌ విన్న బన్నీకి ఆ పాయింట్‌ బాగా నచ్చడంతో ఖచ్చితంగా మనం కలిసి ఓ చిత్రం చేద్దాం అని మాటిచ్చాడట. అయితే తనకు ప్రస్తుతం చాలా కమిట్‌మెంట్స్‌ ఉన్నాయని, అప్పటివరకు వెయిట్‌ చేయాలని శ్రీనువైట్లకు చెప్పాడని సమాచారం. దీంతో శ్రీనువైట్ల ఎంతో హ్యాపీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను చేయబోయే వరుణ్‌తేజ్‌ సినిమా ఫలితం మీదనే బన్నీ సినిమా అవకాశం ఆధారపడివుందని తెలుసుకొని ఎంతో టెన్షన్‌ పడుతున్నాడని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*