ఈ తమిళ భామకి ఇంత ధైర్యమేమిటో ?

Keerthi Suresh

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. గ్లామర్ ప్రపంచం. అందుకే అధిక సంఖ్యలో యువత ఈ పరిశ్రమ వైపు ఆకర్షితులవుతుంటారు. ఇక కథానాయికలుగా ప్రయత్నించే వారైతే ఎప్పటికప్పుడు వారి అందాన్ని సంరక్షించుకుంటూ అత్యాధునిక మేకప్ పరికరాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయో ఒక కంట కనిపెడుతుంటారు. చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ కథానాయకులు నటించే కమర్షియల్ చిత్రాల వరకు కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే గ్లామరస్ లుక్స్ కే అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే కథానాయికగా ఎదిగిన తరువాత కూడా హీరోయిన్స్ వెన్సీతెరపైనే కాక షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు వచ్చినా, సినిమా మరియు అవార్డ్స్ వేడుకలకు వచ్చినా, సోషల్ మీడియాలో అభిమానులను పలకరించాల్సి వచ్చినా ఆఖరికి బెడ్ రూమ్ లో దిగే సెల్ఫీ లకైనా మేకప్ కచ్చితంగా ధరిస్తారు. కానీ వీటన్నిటికీ తాను అతీతం అని నిరూపిస్తోంది యువ కథానాయిక కీర్తి సురేష్.

నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతూనే అనూహ్యమైన విజయం అందుకోవటంతో పాటు వారి హృదయాలను దోచుకున్న కీర్తి సురేష్ ఈ నెలలో విడుదలైన మరో తెలుగు చిత్రం నేను లోకల్ తోనూ సక్సెస్ అందుకుంది. ఈ రెండు చిత్రాలలోనూ గ్లామరస్ గానే కనిపించిన కీర్తి సురేష్ తెలుగులోకి అనువదించబడ్డ తమిళ చిత్రం రైల్ లో డీ గ్లామరైజ్డ్ పాత్రలో మేకప్ లేకుండా నటించి తన సహజ అందాలతోనే ప్రేక్షకులని ఆకర్షించింది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉండటంతో తెలుగు, తమిళ, మళయాళ భాషలలో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. పైగా అన్నీ గ్లామరస్ రోల్స్ కావటం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కమర్షియల్ ఫిలిం లో హీరోయిన్ గా అవకాశం సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పటికి కూడా మేకప్ ధరించని తన సహజ సౌందర్యాన్ని తానే సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ ద్వారా పంచుకుంటోందంటే కీర్తి సురేష్ ధైర్యానికి అవాక్కవ్వాల్సిందే. గ్లామర్ ని కాక ప్రతిభని నమ్ముకుని ఎదగాలని అనుకుంటుంది అని సరిపెట్టుకుందాం అంటే అమ్మడు చేసేవి అన్నీ కమర్షియల్ సినిమాలే మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*