ఈ మెరుపులు దాని కోసమేనా….!!

ఈ మధ్యన శ్రీదేవి తన కూతురుని హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించడానికి తెగ కష్టపడుతుంది. ఒకసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ఎటువంటి తేడా కొట్టకుండా ముందునుండే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. జాన్వీ కపూర్ ని బాలీవుడ్ నుండే తెరంగేట్రం చేయించడానికి శ్రీదేవి ఇప్పటికే బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ జోహార్ ని లైన్ లో పెట్టింది. ఇక సినిమాల్లోకి వెళ్ళాక వెనుదిరిగి చూడకుండా యాక్టింగ్ శిక్షణ, డాన్సులో మెలుకువలు కూడా నేర్పించేస్తుంది. అయితే జాన్వీ మాత్రం సినిమాల కన్నా ఎక్కువ ఫోకస్ బాయ్ ఫ్రెండ్ మీద పెట్టి అతనితో ఎక్కడికి బడితే అక్కడికి తిరుగుతూ మీడియాకి చిక్కుతుంది. బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ అంటూ తిరుగుతుంది.

ఇక శ్రీదేవి అలా జాన్వీ సినిమాల్లోకి ఎంటర్ కాకముందే మీడియాలో బాయ్క ఫ్రెండ్ తో కనబడం నచ్చక కూతురికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే కూతురితో కలిసి శ్రీదేవి ఈ మధ్యన మీడియాలో తెగ హంగామా చేస్తుంది. ఈ వయసులోనూ శ్రీదేవి అందం వర్ణనాతీతం. కూతురు జాన్వీ ని తలదన్నే రీతిలో శ్రీదేవిని చూస్తుంటే అబ్బో అనిపించక మానదు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులలో ఒక పక్క కూతురు మరోపక్క తల్లి మెరులు మెరిపిస్తున్నారు. అయితే శ్రీదేవి ఇలా మీడియాలో సందడి చెయ్యడానికి కారణం కూడా కూతురు జాన్వినేనంట. జాన్వీని పబ్లిసిటీ చెయ్యడం కోసమే శ్రీదేవి ఇలా కూతురితో కలిసి రకరకాల ఫోజుల్లో దర్శనమిస్తుంది అంటున్నారు. మరంతేలే కూతురికోసం ఆ మాత్రం చెయ్యాలిగా శ్రీదేవి అని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*